విశాఖలో మహిళల సిగపట్లు

x
Highlights

విశాఖలో వడ్లపూడి కాలనీలో ఓ రహదారి నిర్మాణంలో తలెత్తిన వివాదం తన్నుకునే దాకా వచ్చింది. నడిరోడ్డుపై మహిళలంతా సిగపట్లు పట్టారు. ఈ విషయంపై వడ్లపూడి...

విశాఖలో వడ్లపూడి కాలనీలో ఓ రహదారి నిర్మాణంలో తలెత్తిన వివాదం తన్నుకునే దాకా వచ్చింది. నడిరోడ్డుపై మహిళలంతా సిగపట్లు పట్టారు. ఈ విషయంపై వడ్లపూడి కాలనీలో కొంతకాలంగా రెండు వర్గాలకు సరిహద్దు వివాదం నడుస్తోంది. కాలనీ రోడ్డును ఆక్రమించుకుని ఓ కుటుంబం నిర్మాణం చేపడుతుండడంతో స్థానిక మహిళలు వారిని వారించారు. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఆక్రమణదారులు తమపై దాడి జరిగినట్లు దువ్వాడ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. కాలనీలో మహిళలు గొడవ పడుతుంటే ఆక్రమణదారుల్లో ఒకరైన ఆటో డ్రైవర్ మధ్యలో ఎంట్రీ ఇచ్చాడు. మహిళలని కూడా చూడకుండా తన ప్రతాపం చూపించాడు. దీంతో రెండు వర్గాలు పోలీస్ స్టేషన్‌లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories