ఓటు వేసేందుకు వస్తూ అనంతలోకాలకు

nanireddy
Updated on: 24 Dec 2018 4:28 PM IST
ఓటు వేసేందుకు వస్తూ అనంతలోకాలకు
X

తెలంగాణాలో ఎన్నికల సందర్బంగా జోగులాంబ గద్వాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓటు వేసేందుకు హైదరాబాదు నుంచి బయలుదేరిన ఓ కుటుంబం యాక్సిడెంటుకు గురైంది. దాంతో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఇటిక్యాల మండలం శాగాపూరు గ్రామానికి చెందిన వేణుగోపాల్‌గౌడ్‌, కిశోర్‌, అశోక్‌, సంధ్య, ఉమ ఎన్నికల్లో ఓటు వేసేందుకు హైదరాబాదు నుంచి కారులో తమ స్వగ్రామానికి బయలుదేరారు. అయితే అడ్డాకుల దగ్గరికి రాగానే ఎదురుగా వెళ్తున్న లారీని దాటబోయి వెనక నుంచి కారు ఢీకొట్టింది. దాంతో కారులో ఎడమవైపు ముందు సీట్లో కూర్చున్న ఉమ (55)కు తలకు తీవ్ర గాయాలై అందులోనే ఇరుక్కు పోయింది. సమాచారం అందుకున్న 108 సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి వచ్చింది. కానీ దురదృతవశాత్తు ఉమ అప్పటికే ప్రాణాలు కోల్పోయింది. మిగిలిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

nanireddy

nanireddy

Next Story