Top
logo

చందానగర్‌లో విషాదం

చందానగర్‌లో విషాదం
X
Highlights

హైదరాబాద్ చందానగర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. స్ధానికంగా ఉన్న పీజేఆర్‌ ఎన్‌క్లేవ్‌లోని సాయి పెరల్‌...

హైదరాబాద్ చందానగర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. స్ధానికంగా ఉన్న పీజేఆర్‌ ఎన్‌క్లేవ్‌లోని సాయి పెరల్‌ అపార్ట్‌మెంట్‌లో సోమవారం ఓ మహిళ తన కూతురుతో సహా ఆత్మహత్యకు పాల్పడింది. అపార్ట్‌ మెంట్‌లో నివాసముంటున్న స్వాతి(35) అనే మహిళ.. కూతురు శాన్వీ(1)తో కలిసి ఐదవ అంతస్తు పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో స్వాతి, కుమార్తె శాన్వి(01) అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్వాతి ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Next Story