నవవధువు ఆత్మహత్య... సెల్ఫీ వీడియో!

నవవధువు ఆత్మహత్య... సెల్ఫీ వీడియో!
x
Highlights

పెద్దలు ఇష్టం లేకుండా పెళ్లి చేశారో... లేక కట్టుకున్న భర్త నచ్చలేదో... పెళ్లయిన నాలుగు నెలలకే ఓ నవ వధువు తన ప్రాణాలు తీసుకుంది. మరణించే ముందు తన...

పెద్దలు ఇష్టం లేకుండా పెళ్లి చేశారో... లేక కట్టుకున్న భర్త నచ్చలేదో... పెళ్లయిన నాలుగు నెలలకే ఓ నవ వధువు తన ప్రాణాలు తీసుకుంది. మరణించే ముందు తన నిర్ణయానికి కారణాలను చెబుతూ సెల్ఫీ వీడియో తీసుకుంది. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఆదివారం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం 30వ వార్డు కొండయ్య చెరువు పరంజ్యోతి స్కూలు సమీపంలోని తిరుమల ఎన్‌క్లేవ్‌లో రైల్వే పార్శిల్‌ సర్వీస్‌ ఉద్యోగి ఉద్దండి వీరవెంకటనాగేశ్వరరావు ఉంటున్నారు. ఆయన తన కుమార్తె మౌనిక (24)ను ఆగస్టులో ఒంగోలుకు చెందిన తిరుమలశెట్టి నరేంద్రకు ఇచ్చి పెళ్లిచేశారు.

అతను బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం మౌనిక మూడవ నెల గర్భిణి. దీంతో నెల క్రితం బెంగళూరు నుంచి పుట్టింటికి వచ్చింది. బెంగళూరులో ఏం జరిగిందో ఏమో... తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అంతకన్నా ముందు భర్త అంటే తనకు ఇష్టం లేదని, అందుకే చనిపోతున్నానని వీడియో రికార్డు చేసింది. మౌనిక ఆత్మహత్యపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు, వీడియోను స్వాధీనం చేసుకుని కేసును దర్యాఫ్తు చేస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories