సబ్‌ రిజిస్ట్రార్‌ ఉద్యోగులపై తిరగబడిన మహిళ

x
Highlights

తమ ఆస్తిని మరోకరికి రిజిస్ట్రేషన్‌ చేసిన అధికారులపై ఓ మహిళ తిరగబడింది. తమ ప్రమేయం లేకుండా ఆస్తిని మరోకరి పేరు మీద ఎలా బదిలీ చేశారంటూ ప్రశ్నించింది....

తమ ఆస్తిని మరోకరికి రిజిస్ట్రేషన్‌ చేసిన అధికారులపై ఓ మహిళ తిరగబడింది. తమ ప్రమేయం లేకుండా ఆస్తిని మరోకరి పేరు మీద ఎలా బదిలీ చేశారంటూ ప్రశ్నించింది. సమాధానం చెప్పకపోతే చెప్పుతో నాలుగు తగిలిస్తానంటూ అధికారులను హడలెత్తించిన ఘటన కర్నూలు జిల్లా ఆదోనిలో చోటు చేసుకుంది. మండగిరికి చెందిన అరుణ అనే మహిళ తన ఆస్తిని మరోకరిపై రిజిస్ట్రేషన్ చేశారంటూ గత కొద్ది కాలంగా అధికారుల చుట్టూ తిరుగుతోంది. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో సహనం నశించిన అరుణ తనకు తగిన సమాధానం చెప్పకపోతే చెప్పుతో తగిన గుణపాఠం చెబుతానంటూ హెచ్చరించింది. దీంతో చుట్టుపక్కల వారు వచ్చి అరుణను శాంతింపజేశారు వీలైనంత త్వరగా వివరాలు అందిస్తామంటూ సర్ధిచెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories