మహిళపై లెఫ్ట్ పార్టీ నేత లైంగిక దాడి..రాజీకి ఒప్పుకోలేదని బాధితురాలిని వివస్త్రను చేసి వీడియో తీసిన వైనం

x
Highlights

అత్యాచారం చేశాడు. తర్వాత రాజీ కుదుర్చుకోవాలని చూశాడు. అందుకు ఆమె ఒప్పుకోలేదు. అంతే ఆ మహిళను వివస్త్రను చేసి వీడియో తీశాడు. తన మాట వినకపోతే.....

అత్యాచారం చేశాడు. తర్వాత రాజీ కుదుర్చుకోవాలని చూశాడు. అందుకు ఆమె ఒప్పుకోలేదు. అంతే ఆ మహిళను వివస్త్రను చేసి వీడియో తీశాడు. తన మాట వినకపోతే.. ఇంటర్నెట్‌లో పెడతానని బెదిరించాడు వామపక్ష పార్టీ నాయకుడు. ఈ అమానుషమైన ఘటన ఇప్పుడు నెల్లూరులో కలకలం రేపుతోంది.

నెల్లూరు హౌసింగ్ బోర్డుకు చెందిన సౌమ్య భర్తకు విడాకులిచ్చింది. క్యాటరింగ్ పనులు చేసుకుంటూ జీవిస్తోంది. 4 నెలల క్రితం సౌమ్యపై అత్యాచారం చేసేందుకు వామపక్ష పార్టీ నేత శ్రీహరి యత్నించాడు. బాధితురాలి ఫిర్యాదుతో కామ్రేడ్ కామాంధుడిపై ఎస్సీ,ఎస్టీ కేసుతో పాటు రేప్ కేసు నమోదు చేశారు పోలీసులు. తనపై పెట్టిన కేసును విత్ డ్రా చేసుకోవాలంటూ సౌమ్యపై ఒత్తిడి తీసుకొచ్చాడు శ్రీహరి.

శ్రీహరికి సౌమ్య భర్త ప్రదీప్ కూడా తోడవటంతో వేధింపులు ఎక్కువయ్యాయి. తనపై జరిగిన అఘాయిత్యం విషయంలో కాంప్రమైజ్ కాబోనని తేల్చి చెప్పింది. అంతే రాజీకి ఒప్పుకోని సౌమ్యపై శ్రీహరి, ప్రదీప్ కక్ష పెంచుకున్నారు. ఆమెపై దాడికి తెగబడ్డారు. వివస్త్రను చేసి వీడియో చిత్రీకరించారు. కేసు విత్ డ్రా చేసుకోకపోతే వీడియోను ఇంటర్నెట్‌లో పెడతామని బెదిరిస్తున్నారు.

ప్రస్తుతం సౌమ్య నెల్లూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. నిందితుడు శ్రీహరి నుంచి ప్రాణహాని ఉందని తనకు రక్షణ కల్పించాలని వేడుకుంటోంది. అయితే, కేసు నమోదు చేసుకునేందుకు పోలీసులు వెనుకాడుతున్నారని బాధితురాలు వాపోతోంది. ఆలస్యంగా బయటపడ్డ ఈ విషయం స్థానికంగా కలకలం రేపుతోంది. ఎన్ని చట్టాలున్నా సమాజంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని చెప్పడానికి ఈ ఘటన మరో ఉదాహరణగా నిలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories