logo
జాతీయం

భర్త ముందే భార్యపై అత్యాచారం

భర్త ముందే భార్యపై అత్యాచారం
X
Highlights

భర్త ముందే భార్యపై అత్యాచారం చేసిన ఘటన హర్యానాలో చోటు చేసుకుంది. ఈ ఘటన గుర్గావ్‌లోని సెక్టార్ 56లో ఆదివారం...

భర్త ముందే భార్యపై అత్యాచారం చేసిన ఘటన హర్యానాలో చోటు చేసుకుంది. ఈ ఘటన గుర్గావ్‌లోని సెక్టార్ 56లో ఆదివారం రాత్రి చోటు చేసుకోగా..పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..గురుగ్రామ్‌కు చెందిన 22ఏళ్ల మహిళ తన భర్త, బావతో కలిసి ఓ వేడుకకు హాజరై తిరిగి వెళ్తుండగా.. రెండు కార్లలో వచ్చిన నలుగురు యవకులు అడ్డుకున్నారు. అందులోని ఓ వ్యక్తి మహిళను కారు నుంచి బయటకు లాగి సమీపంలోని పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన మహిళ భర్త, బావను మిగతా ముగ్గురు యువకులు తుపాకీ పెట్టి బెదిరించారు. ఘటన అనంతరం నలుగురు యువకులు అక్కడి నుంచి పారిపోయారు. విషయం పోలీసులకు చెప్తే చంపేస్తామని దుండగులు దంపతులను బెదిరించారు. మొత్తానికి బాధితురాలి భర్త.. నిందితుల కారు నెంబర్‌ను నోట్ చేసుకోవడంతో వారిని పట్టుకునేందుకు మార్గం సులువైంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నలుగురు నిందితులను అరెస్టు చేశారు. హర్యానాలో ఈ పది రోజుల్లోనే పది అత్యాచారం కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు.

Next Story