logo
ఆంధ్రప్రదేశ్

అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని.. 17 ఏళ్ల కొడుకును చంపేసిన తల్లి!

అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని.. 17 ఏళ్ల కొడుకును చంపేసిన తల్లి!
X
Highlights

మాతృత్వానికి మచ్చ తెచ్చేలా, సభ్య సమాజం తల దించుకునేలా దారుణానికి ఒడిగట్టింది ఓ తల్లి. తన అక్రమ సంబంధానికి...

మాతృత్వానికి మచ్చ తెచ్చేలా, సభ్య సమాజం తల దించుకునేలా దారుణానికి ఒడిగట్టింది ఓ తల్లి. తన అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడనే కారణంతో... 17 ఏళ్ల వయసున్న కన్న కొడుకునే హతమార్చింది. ఈ దారుణ ఘటన విజయనగంలోని గాయత్రీ నగర్ లో చోటు చేసుకుంది. గాయత్రీనగర్‌కు చెందిన వెంకట పద్మావతి కొడుకు ముదునూరి హరి భగవాన్‌ విజయనగరంలోని శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్‌ చదువుతున్నాడు. అతను మంగళవారం నిద్రలోనే ప్రాణాలు విడిచాడు. తల్లి వెంకట పద్మావతి ఆహారంలో నిద్రమాత్రలు కలిపి ఇవ్వడంతో హరి భగవాన్‌ మృతిచెందాడు. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే.. వెంకట పద్మావతి ఈ దారుణానికి ఒడిగట్టినట్టు తెలుస్తోంది. ఈ ఘటన విజయనగరంలో కలకలం రేపుతోంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Next Story