నా భర్తను నేను చంపలేదు...అంతా నా మాజీ ప్రియుడే చేశాడు

నా భర్తను నేను చంపలేదు...అంతా నా మాజీ ప్రియుడే చేశాడు
x
Highlights

కార్పెంటర్‌ నాగరాజు హత్యకేసులో భార్య జ్యోతి కొత్త కొత్త విషయాలు చెబుతోంది. తన భర్త హత్యలో తన ప్రమేయం ఏమీ లేదంటోంది. అంతా తన మాజీ ప్రియుడు కార్తీకే...

కార్పెంటర్‌ నాగరాజు హత్యకేసులో భార్య జ్యోతి కొత్త కొత్త విషయాలు చెబుతోంది. తన భర్త హత్యలో తన ప్రమేయం ఏమీ లేదంటోంది. అంతా తన మాజీ ప్రియుడు కార్తీకే చేశాడంటోంది. తాను కేవలం హత్య జరిగిన రోజు తన భర్తకి నిద్ర మాత్రలు మాత్రమే వేశానని అంటుంది. నా భర్తను చంపేస్తారని నాకు తెలియదు. అపస్మారక స్థితిలో ఉన్న నా భర్తను ఎక్కడకు తీసుకెళ్తున్నారో చెప్పలేదు. నా భర్తను చంపేశారని పోలీసులు ఫోన్‌ చేసి చెప్పిన తర్వాతే తెలిసింద’ని భర్త హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితురాలు జ్యోతి తెలిపింది.

ఈ కేసులో నిందితులను పోలీసులు శుక్రవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. కర్మన్‌ఘాట్‌ ప్రాంతానికి చెందిన కార్పెంటర్‌ నాగరాజు హత్య కేసులో అతడి భార్య జ్యోతి, ప్రియుడు కార్తీక్‌, దీపక్, యాసీన్‌, నరేష్‌లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. జ్యోతి, కార్తీక్‌, అతడి స్నేహితులు కలిసి పథకం ప్రకారం నాగరాజును హత్య చేశారని డీసీపీ రామచంద్రారెడ్డి తెలిపారు. నేరం చేసినట్టు నిందితులు అంగీకరించారని చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories