బయటపడ్డ దాచేపల్లి జెడ్పీటీసీ లైంగిక వేధింపులు

x
Highlights

గుంటూరు జిల్లా దాచేపల్లి జెడ్పీటీసీ ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. జెడ్పీటీసీ ప్రకాష్ రెడ్డి తనను లైంగికంగా...

గుంటూరు జిల్లా దాచేపల్లి జెడ్పీటీసీ ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. జెడ్పీటీసీ ప్రకాష్ రెడ్డి తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ ముత్యాలంపాడుకు చెందిన జ్యోతి ఎస్పీ అప్పల నాయుడికి ఫిర్యాదు చేసింది. జ్యోతి భర్త చనిపోయినప్పటి నుంచి ఆస్తి పంపకాలలో జెడ్పీటీసీ తలదూర్చారని.... పొలం పాసు పుస్తకాలు రాకుండా రెవిన్యూ సిబ్బందితో కలసి ప్రకాష్ రెడ్డి అడ్డుకుంటున్నట్లు మహిళ వాపోయింది.

చెల్లెలు వరుస అయ్యే తనతోనే కోరిక తీర్చాలంటూ వేధిస్తున్నాడని ఆరోపించింది. ఈ వ్యవహారంపై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో మాజీ మావోయిస్ట్ నర్సిరెడ్డితో దాడి చేయించాడని తన గోడును వెల్లబోసుకుంది. తనకు న్యాయం చేయాలని బాధితురాలు వేడుకుంటుంది. ఆస్తి కోసమే జ్యోతి డ్రామాలు ఆడుతుందని మరోవైపు జెడ్పీటీసీ ప్రకాష్‌రెడ్డి ఆరోపించారు. జ్యోతిని అడ్డుపెట్టుకుని టీడీపీ నీచ రాజకీయాలకు పాల్పడుతుందని విమర్శించారు. జ్యోతి తన బామ్మర్థి భార్య... భర్త చనిపోవడంతో మరో పెళ్లి చేసుకుందని గుర్తు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories