మరోసారి తెరమీదకు వచ్చిన స్వాతి కేసు

మరోసారి తెరమీదకు వచ్చిన స్వాతి కేసు
x
Highlights

మానవత్వాన్ని మంటగలుపుతూ కట్టుకున్న భర్తనే దారుణంగా హతమార్చిన స్వాతి ఉదంతం మరోసారి సంచలనంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపిన ఈ కేసులో...

మానవత్వాన్ని మంటగలుపుతూ కట్టుకున్న భర్తనే దారుణంగా హతమార్చిన స్వాతి ఉదంతం మరోసారి సంచలనంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపిన ఈ కేసులో ఏ2గా ఉన్న స్వాతికి మూడు రోజుల క్రితం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వివాహా సంబంధాన్ని అపహాస్యం చేస్తూ విశ్వాస ఘాతుకానికి పాల్పడిన స్వాతి తరపున వాదించేందుకు ఏ ఒక్క న్యాయవాది ముందుకు రాలేదు. దీంతో న్యాయసేవా సంస్ధ తరపున ఆమె బెయిల్ కోసం పోరాడారు. రెండు సార్లు బెయిల్ తిరస్కరణకు గురైన తరువాత మూడో సారి స్వాతికి బెయిల్ లభించింది. జైలు నుంచి బయటకు వచ్చిన స్వాతిని ఆదరించి అక్కున చేర్చుకునే వారు ఒక్కరూ కూడా రాకపోవడంతో కన్నీరు పెట్టుకుంది. తాను చేసిన తప్పును తలచుకుంటూ వెక్కివెక్కి ఏడ్చింది. అయినా కన్నవారు కాదు పొమ్మన్నారు. అత్తింటి వారు కడుపు కోత రగిల్చిన స్వాతి మొహం చూడమంటూ తెగేసి చెప్పారు. దీంతో ఎటు వెళ్లాలో తెలియక సతమతమవుతున్న స్వాతిని పోలీసులు స్టేట్‌ హోంకు తరలించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories