ఇద్ద‌రు స్నేహితుల మ‌ధ్య చిచ్చుపెట్టిన మిత్ర ధ‌ర్మం

ఇద్ద‌రు స్నేహితుల మ‌ధ్య చిచ్చుపెట్టిన మిత్ర ధ‌ర్మం
x
Highlights

మిత్ర ధర్మమని వారూ అంటున్నారు. వీరు అంటున్నారు. ఇద్దరూ మిత్ర ధర్మమే పాటిస్తుంటే మరి అధర్మమెక్కడుంది? బీజేపీకి, టీడీపీకి మధ్య జరుగుతున్న రగడలో ఎవరిది...

మిత్ర ధర్మమని వారూ అంటున్నారు. వీరు అంటున్నారు. ఇద్దరూ మిత్ర ధర్మమే పాటిస్తుంటే మరి అధర్మమెక్కడుంది? బీజేపీకి, టీడీపీకి మధ్య జరుగుతున్న రగడలో ఎవరిది ధర్మం? ఎవరిది అధర్మం? అంతా మోడీ చేస్తుంటే ఆ క్రెడిట్‌ ఏపీ సర్కార్‌ కొట్టేస్తోందని తాజాగా సోమూ వీర్రాజు చేసిన విమర్శలు మిత్ర ధర్మాన్ని ఎక్కడికి తీసుకెళ్లనున్నాయి?

మిత్ర ధర్మాన్ని బీజేపీ పాటిస్తోందని, అయితే టీడీపీ కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలను సొంత పథకాలుగా అమలు చేస్తోందని బీజేపీ నేత సోము వీర్రాజు మండపడ్డారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులను ఉపయోగించి అమలు చేస్తున్న పథకాలకు చంద్రన్న, ఎన్టీఆర్‌ అని పేరు పెట్టుకుంటున్నారని విమర్శించారు. బీజేపి నేత సోమువీర్రాజు వ్యాఖ్యలపై మంత్రి సుజయ క్రిష్ణ రంగారావు స్పందించారు. టీడీపీ ఏక్కడా మిత్రదర్మాన్ని విస్మరించలేదన్నారు. కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల్లో టీడీపీ ఏక్కడ.. బీజేపీకి అన్యాయం చేయలేదన్నారు.

వైసీపీ ఎల్పీ కార్యాలయం సమీపంలో తాను చేసిన వ్యాఖ్యలపై బీజేపీ శాసనసభాపక్షనేత విష్ణుకుమార్ రాజు వివరణ ఇచ్చారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మంత్రిపదవులు ఇవ్వడం తప్పు అనేది తన వ్యక్తిగత అభిప్రాయమని తేల్చి చెప్పారు. ఈ వ్యాఖ్యలతో బీజేపీకి సంబంధంలేనది స్పష్టం చేశారు. దీన్ని రాజకీయ కోణంలో చూడరాదని విష్ణుకుమార్ రాజు కోరారు. గత ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన మిత్ర పక్షాల ఇప్పుడు ఓపెన్‌గా విమర్శించుకుంటుంటే.. వచ్చే ఎన్నికల నాటికి వీరి పొత్తు ఉంటాందా అని.. రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories