జగన్‌ నా దోస్త్‌.. ప్రచారం చేస్తా: ఒవైసీ

జగన్‌ నా దోస్త్‌.. ప్రచారం చేస్తా: ఒవైసీ
x
Highlights

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏపీ సిఎ నారా చంద్రబాబుపై ఏపీ పజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని మజ్లిస్ నేత అసదద్దీన్ ఒవైసీ అన్నారు. తెలంగాణ అసెంబ్లీ...

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏపీ సిఎ నారా చంద్రబాబుపై ఏపీ పజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని మజ్లిస్ నేత అసదద్దీన్ ఒవైసీ అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు కోట్లు ఖర్యుచేసి ప్రచారం చేసిన తెలంగాణ ప్రజలు మాత్రం టీఆర్ఎస్ పార్టీకే పట్టం కట్టారని తెలిపారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో చంద్రబాబు కనీసం రెండంటే రెండు సీట్లు కూడా సాధించలేరని స్పష్టం చేశారు. భారతదేశానికి బీజేపీ, కాంగ్రెసేతర రాజకీయ ా పార్టీల కూటమి ఎంతో అవసరం ఉందని ఈ కూటమికై సిఎం కెసిఆర్ ప్రయత్నాలకు మజ్లీస్ ఎల్లప్పుడు అండగా నిలుస్తుందని తెలిపారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెరాస, మజ్లిస్‌లను తీవ్రవిమర్శలు గుప్పించిన అమిత్ షా, యోగి, మోదీ, రాహుల్ గాంధీలకు ప్రజలు తగిన బుద్ది చెప్పారని మండిపడ్డారు. మజ్లిస్‌ను బీజేపీకి ‘సీ’ టీంగా, మోదీ టీంగా అభివర్ణించిన చంద్రబాబుకు వ్యతిరేకంగా తాను తప్పకుండా ఆంధ్రప్రదేశ్‌లో ప్రచారం చేస్తానని స్పష్టం చేశారు. ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైసీపీ అధ్యక్షుడు జగన్‌ తనకు మంచి స్నేహితుడని, ఆయనకు అండగా నిలుస్తానన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories