భార్యపై భర్త న్యాయ పోరాటం

x
Highlights

వేధింపుల కేసులలో ఇప్పటి వరకు భర్త వేధించాడని భార్య కేసులు పెట్టిన ఘటనలే చూశాం. కానీ కానీ...ఇప్పుడు ట్రెండ్ మారినట్లుంది. సతులపై పతులు పోరాటానికి...

వేధింపుల కేసులలో ఇప్పటి వరకు భర్త వేధించాడని భార్య కేసులు పెట్టిన ఘటనలే చూశాం. కానీ కానీ...ఇప్పుడు ట్రెండ్ మారినట్లుంది. సతులపై పతులు పోరాటానికి దిగుతున్నారు. నల్లగొండ జిల్లాలో ఓభర్త తన భార్య వేధింపులు తట్టుకోలేకపోతున్నానంటూ కోర్టును ఆశ్రయించిన బాధితుడు. ఇతని పేరు రావుల భాస్కర్, నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం ఊట్కూరుకు చెందిన రావుల భాస్కర్...తన భార్య రేణుక వేధిస్తోందంటూ కోర్టును ఆశ్రయించాడు. భార్యతో పాటు బంధువులపైనా నకిరేకల్ న్యాయస్థానంలో గృహ హింస చట్టం కింద ఫిర్యాదు చేశాడు. పోలీస్ డిపార్టుమెంటులో పని చేస్తున్న రేణుక మేనమామ అండతో భాస్కర్‌పై అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారంటూ పిటిషన్ దాఖలు చేశాడు.

భార్యపై భర్త గృహహింస కేసు నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే గతంలో అత్యున్నత న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులకు అనుగుణంగానే భార్యపై గృహహింస కేసు నమోదు చేశామని పిటిషనర్ తరుపు న్యాయవాది చెబుతున్నారు. భార్యపై భర్త పెట్టిన గృహహింస కేసు అంశంలో న్యాయస్థానం ఎలా స్పందిస్తుందనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. దీంతో అందరి చూపూ నకిరేకల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు వైపు పడింది.

Show Full Article
Print Article
Next Story
More Stories