ప్రియుడి మోజులో మునిగి.. భర్తని కడతేర్చిన భార్య

ప్రియుడి మోజులో మునిగి.. భర్తని కడతేర్చిన భార్య
x
Highlights

వివాహేతర సంబంధానికి అడ్డొస్తాడని భర్తని తన ప్రియుడు, అతని స్నేహితులతో కలిసి పక్కా ప్లాన్ తో హత్య చేసిందో భార్య. మృతుని సోదరుడు తన అన్న కనిపించటం లేదని...

వివాహేతర సంబంధానికి అడ్డొస్తాడని భర్తని తన ప్రియుడు, అతని స్నేహితులతో కలిసి పక్కా ప్లాన్ తో హత్య చేసిందో భార్య. మృతుని సోదరుడు తన అన్న కనిపించటం లేదని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో డొంక కదిలింది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో కాపురం వుంటున్న నందినికి విశ్వేశ్వర్ రెడ్డితో పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. మంజునాథ్ తమ సంబంధానికి అడ్డు తగులుతాడని భావించిన నందిని, విశ్వేశ్వర్ రెడ్డి జనవరి 3న మద్యం సేవించి హిందూపురానికి ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లారు. తమతో విశ్వేశ్వర్ రెడ్డి స్నేహితుడు హనుమంతరాయుడిని వెంట తీసుకెళ్లారు. హిందూపురం సమీపంలోని కనుమ గుడి దగ్గరున్న గుట్టలోకి వెళ్ళి అందరూ కలిసి మరోసారి మద్యం సేవించారు. కత్తితో విశ్వేశ్వర్ రెడ్డి మంజునాథ్ గొంతు కోసి చంపారు, ఆనవాలు లేకుండా కిరోసిన్ పోసి తగలబెట్టి పక్కనే వున్న గుంతలో పాతిపెట్టారు. అన్న కనపడక పోవడంతో మంజునాథ్. సోదరుడు అనిల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు,మిస్సింగ్ కేసు గా కేసు నమోదు చేసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు విషయం వెలుగు చూసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories