భర్తను హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించిన భార్య..

భర్తను హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించిన భార్య..
x
Highlights

అక్రమ సంబంధాన్ని ప్రశ్నించిన భర్తను దారుణంగా హత్యచేసి ప్రమాదంగా చిత్రీకరించింది భార్య. ఘటన విషయంలోకి వస్తే కర్నూల్ జిల్లా వెల్దుర్తి మండలం...

అక్రమ సంబంధాన్ని ప్రశ్నించిన భర్తను దారుణంగా హత్యచేసి ప్రమాదంగా చిత్రీకరించింది భార్య. ఘటన విషయంలోకి వస్తే కర్నూల్ జిల్లా వెల్దుర్తి మండలం బోయినపల్లికి చెందిన లక్ష్మీదేవి శివరాముడు దంపతులు.. వీరికి 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. లక్ష్మిదేవి అదే గ్రామానికి చెందిన రామకృష్ణ అనే వ్యక్తితో గత 7 ఏళ్లుగా వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం భర్తకు తెలియడంతో తరచుగా గొడవపడుతుండే వారు. అయితే 20 రోజుల క్రితం కూతురు పెళ్లి చేశారు. గురువారం నూతన దంపతులు ఇంటికి వచ్చారు. కూతురు అల్లుడు ముందే వివాహేతర సంబంధం విషయంలో భర్త శివరాములుకు లక్ష్మీదేవికి మధ్య గొడవ జరిగింది. గొడవ అనంతరం ఇంటి ముందు అరుగుపై నిర్ద్రిస్తున్న భర్తను ప్రియుడితో కలిసి వేట కొడవలితో హతమార్చారు. దీనిని ప్రమాదంగా చిత్రీకరించడానికి విఫల ప్రయత్నాలు చేశారు.


ఉదయం ఇంటిమిద్దె పైనుంచి పడి మృతి చెందినట్లు నమ్మించారు. సంఘటన స్థలంలో మట్టి ఉండటం, తలపై గాయాలు ఉండడాన్ని పోలీసులు అనుమానించారు. శుక్రవారం రాత్రి శవపరీక్షలో హత్య అని తేలడంతో ఆరా తీశారు. నిందితులుగా రామకృష్ణ, లక్ష్మీదేవిలను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం మృతుడి తల్లి జయకృష్ణమ్మ ఫిర్యాదు మేరకు వీరిద్దరిపై హత్య కేసు నమోదు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories