ఇన్సూరెన్స్‌ డబ్బుల కోసం భర్తను చంపేసింది

x
Highlights

ఉద్యోగం..ఇన్సూరెన్స్‌ డబ్బుల కోసం కట్టుకున్న భర్తనే కడతేర్చింది ఓ ఇల్లాలు. పథకం ప్రకారం భర్తను హత్య చేయించిన భార్య రోడ్డు ప్రమాదంలో తన భర్త...

ఉద్యోగం..ఇన్సూరెన్స్‌ డబ్బుల కోసం కట్టుకున్న భర్తనే కడతేర్చింది ఓ ఇల్లాలు. పథకం ప్రకారం భర్తను హత్య చేయించిన భార్య రోడ్డు ప్రమాదంలో తన భర్త చనిపోయాడంటూ చిత్రీకరించి కటకటాల పాలయ్యింది. హైదరాబాద్ శివారులోని అబ్దుల్లాపూర్ మెట్ మండలం కమ్మగూడెంకు చెందిన కేస్యానాయక్ పోస్టల్ శాఖలో ఉద్యోగం చేస్తున్నాడు. నల్లగొండ జిల్లాకు చెందిన తుత్యతండాకు చెందిన కేతావత్ పద్మతో ఇరవై ఏళ్ల క్రితం వివాహం జరిగింది అయితే సంతానం కలకగపోవడంతో రెండో పెళ్లి చేసుకున్నాడు కేస్యానాయక్. తనను వేధింపులకు గురిచేస్తున్నాడంటూ కేస్యానాయక్ పై నల్లగొండ జిల్లా త్రిపురారం పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది కేతావత్ పద్మ. ఎనిమిది ఏళ్లుగా భార్యాభర్తలు వేర్వేరుగా ఉంటున్నారు.

భర్త చనిపోతే అతని ఉద్యోగంతో పాటు ఇన్సూరెన్సు డబ్బులు వస్తాయని ఆశపడిన కేతావత్ పద్మ ఎలాగైనా భర్తను హతమార్చాలనుకున్నది. కేస్యానాయక్ కారు డ్రైవర్ సభావత్ వినోద్ తో కలిసి ప్లాన్ చేసింది. తన భర్తను చంపితే పది లక్షలు ఇస్తానని ఒప్పందం కుదుర్చుకుంది. 15 వేల రూపాయలు అడ్వాన్స్ కూడా ఇచ్చింది. అనుకున్న ప్లాన్ ప్రకారం ఈ నెల ఒకటో తేదీన డ్యూటీ ముగించుకుని వస్తున్న కేస్యానాయక్ ను కారు ఎక్కించుకుని గుర్రంగూడ సమీపంలోని ఓ బార్‌కు తీసుకెళ్లాడు డ్రైవర్ వినోద్. ఇద్దరూ కలిసి మద్యం సేవించి కారులో తిరిగి బయల్దేరారు. కొద్ది దూరం ప్రయాణించిన తరువాత కారు ముందు సీటులో మత్తులో ఉన్న కేస్యానాయక్‌‌ను వినోద్‌ గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత ఎవ్వరికి అనుమానం కలుగకుండా ప్రమాదంగా చిత్రీకరించేందుకు 100 కిలో మీటర్ల వేగంతో వెళ్లి కారు ఎడమ వైపు స్తంభానికి ఢీకొట్టాడు.

రెండు రోజులు గడిచిన తర్వాత కరెంట్ స్తంభానికి కారు ఢీకొని తన భర్త మృతి చెందాడంటూ వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది కేతావత్ పద్మ. మొదట రోడ్డు ప్రమాదం కేసుగా నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహంపై ఎలాంటి గాయాలూ లేకపోవడంతో అనుమానం వచ్చిని పోలీసులు డ్రైవర్‌ను ప్రశ్నించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కేస్యా నాయక్‌ భార్య పద్మనే హంతకురాలని తేలింది. కేస్య నాయక్‌ డ్రైవర్‌ వినోద్‌తో కలిసి భర్తను పక్కా ప్లాన్‌ ప్రకారం హతమార్చినట్టు పోలీసుల దర్యాప్తులో వెలుగు చూసింది. కేసు నమోదు చేసిన పోలీసులు వినోద్‌, పద్మలను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories