దారుణం..ప్రియుడి మోజులో పడి...

దారుణం..ప్రియుడి మోజులో పడి...
x
Highlights

భార్యల చేతిలో హత్యకు గురవుతున్న భర్తల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. సిద్దిపేట జిల్లా నంగునూర్‌ మండలం ఘన్‌పూర్‌కు చెందిన బాలయ్యను భార్య హత్య...

భార్యల చేతిలో హత్యకు గురవుతున్న భర్తల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. సిద్దిపేట జిల్లా నంగునూర్‌ మండలం ఘన్‌పూర్‌కు చెందిన బాలయ్యను భార్య హత్య చేసింది. దీంతో ఆగ్రహించిన మృతుడు బంధువులు హతురాలితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఇంటి ముందు మృతదేహంతో ఆందోళన చేశారు. తన అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడనే ఉద్దేశంతో మహిళ తన భర్తనే కడతేర్చింది. ప్రియుడి సాయంతో గొంతుకోసి అతి కిరాతకంగా హత్య చేసింది. వేములవాడ రాజన్న ఆలయం సమీపంలోనే ఈ దారుణం చోటుచేసుకోవడం గమనార్హం! మెదక్ జిల్లా ఘన్‌పూర్ మండలం నంగనూర్‌కు చెందిన బండి బాలయ్య(37) పెళ్లయిన కొత్తలోనే గల్ఫ్‌కు వలస వెళ్లాడు. కొత్తగా పెళ్లయినా.. కుటుంబం ఎదుర్కొంటున్న ఆర్థిక కష్టాలు తీరాలంటే కొంతకాలం భార్య నర్సవ్వకు దూరంగా ఉండక తప్పదని నిర్ణయించుకున్నాడు. కొన్ని సంవత్సరాలపాటు అక్కడే గడిపి ఇటీవలే తిరిగి వచ్చాడు.

అయితే, భర్త గల్ఫ్‌కు వెళ్లడంతో నర్సవ్వకు స్థానికంగా ఉండే ఓ యువకుడితో అక్రమ సంబంధం ఏర్పడింది. ఈ బంధం ఇలా కొనసాగుతుండగా.. భర్త బాలయ్య తిరిగి రావడం నర్సవ్వకు ఆటంకంగా మారింది. ప్రియుడిని కలుసుకోవడం కుదరకపోవడంతో భర్తను అడ్డుతొలగించుకోవాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా ప్రియుడిని, భర్తను తీసుకొని నర్సవ్వ వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయానికి చేరుకుంది. సాయంత్రంపూట భర్తకు మద్యం తాగించి మత్తులోకి జారుకునేలా చేసింది. అర్ధరాత్రి దాటాక ప్రియుడితో కలిసి కత్తితో దాడిచేసి గొంతుకోసింది. దీంతో బాలయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం నర్సవ్వ తన ప్రియుడితో కలిసి పారిపోయింది. భర్త బాలయ్యను దారుణంగా హతమార్చిన నర్సవ్వను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. హత్య సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు తిప్పాపూర్‌ వైపు ఒంటరిగా అనుమానాస్పదంగా వెళుతున్న మహిళను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories