రహస్య వివాహం చేసుకుని.. గర్భిణిని చేసి..

రహస్య వివాహం చేసుకుని.. గర్భిణిని చేసి..
x
Highlights

కడప జిల్లా రాజంపేట పట్టణం ఐసీఐసీఐ బ్యాంక్ ఉద్యోగి గా పనిచేస్తున్నరంగాయపల్లె రాకేశ్‌ మోసం చేసి వదిలేసాడని భార్య విజయలక్ష్మీ చేస్తున్న నిరాహారదీక్ష...

కడప జిల్లా రాజంపేట పట్టణం ఐసీఐసీఐ బ్యాంక్ ఉద్యోగి గా పనిచేస్తున్నరంగాయపల్లె రాకేశ్‌ మోసం చేసి వదిలేసాడని భార్య విజయలక్ష్మీ చేస్తున్న నిరాహారదీక్ష రెండో రోజుకి చేరింది. విజయలక్ష‌్మి దీక్షకి టీడీపీ మహిళా అధ్యక్షురాలు మల్లెల శ్రీవాణి, ఇతర మహిళా సంఘాల నేతలు మద్ధతు తెలిపారు. బాధితురాలి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రాజంపేట పట్టణంలో ఐసీఐసీఐ బ్యాంక్‌ ఉద్యోగిగా పనిచేస్తున్న రంగాయపల్లె రాకేశ్‌ అనే యువకుడు శివపురం రంగయ్య కుమార్తె విజయలక్ష్మీ మూడేళ్లుగా ప్రేమించుకున్నారు. పెద్దలకు తెలియకుండా పెళ్లి చేసుకున్నారు. విజయలక్ష్మీ గర్భం దాల్చింది. ఇప్పుడే పిల్లలు వద్దని, పెద్దలను ఒప్పించిన తర్వాత ఆలోచిద్దామని మాయమాటలు చెప్పి అబార్షన్‌ చేయించాడు. విజయలక్ష్మిని ఆమె తల్లిదండ్రుల వద్ద వదిలి వెళ్లిపోయాడు.

ఆ తర్వాత ఆమెను పట్టించుకోవడం మానేశాడు. దీంతో తాను మోసపోయానని అనుమానించిన ఆమె జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు గతంలో పట్టణ సీఐ ఇరు కుటుంబాల వారిని పిలిపించి మాట్లాడారు. తాను అందరి సమక్షంలో పెళ్లి చేసుకుంటానని, లేని పక్షంలో తనపై పోలీసులు ఎలాంటి చర్య అయినా తీసుకోవచ్చని రాకేశ్‌ రాతపూర్వకంగా పోలీసుల సమక్షంలో రాసి ఇచ్చాడు. అయితే ఇప్పుడు తాను విజయలక్ష్మిని వివాహం చేసుకోనని, ఆమెది తమ కులంకాదని మొండికేశాడు. దీంతో ఆమె భర్త ఇంటి ఎదుట నిరాహారదీక్షకు దిగింది.

Show Full Article
Print Article
Next Story
More Stories