టీఆర్ఎస్ శ్రేణుల్లో పెరుగుతున్న ఆందోళన...ప్రచారంలో దూసుకు పోతున్న...

x
Highlights

ఒక్క నియోజక వర్గంలో ఒక్క సభ చాలు ప్రజల దృష్టి తమమీద పడటానికి పెద్ద సారు ఒక్క సారి ప్రచారం చేస్తే చాలు పై చేయి సాధించినట్లే కానీ సారు మాత్రం రారు...

ఒక్క నియోజక వర్గంలో ఒక్క సభ చాలు ప్రజల దృష్టి తమమీద పడటానికి పెద్ద సారు ఒక్క సారి ప్రచారం చేస్తే చాలు పై చేయి సాధించినట్లే కానీ సారు మాత్రం రారు సలహాలు సూచనలు మాత్రమే వస్తాయి. ఒక పక్క పెరుగుతున్న ప్రచార ఖర్చులు మరోవైపు ప్రచారంలో దూసుకు పోతున్న ప్రత్యర్థులు చూస్తుంటే గులాబీ దళం గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

ఎన్నికలకు సమయం సమీపిస్తున్నా కొద్ది టీఆర్ఎస్ అభ్యర్థుల్లో ఆందోళన పెరుగుతోంది. టికెట్లు పొందిన అభ్యర్థులకు ద్వితీయ శ్రేని నాయకుల సహకారం లభించడం లేదు దీంతో అభ్యర్థులు సొంతగా ప్రచారం చేసుకుంటున్నారు కనీసం మంత్రులు కూడా తమ ప్రచారానికి రావడం లేదని చాలా మంది అభ్యర్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు గత అనుభవాల దృష్ట్యా కాంగ్రెస్ ప్రచారంలో దూసుకు పోతోంది. ప్రజా కూటమి ఏర్పాటు, సీట్ల సర్దు బాటు కోసం వేచి చూడకుండా సీనియర్లంతా ప్రచారంలో మునిగిపోయారు. కాంగ్రెస్ ప్రచార కమిటీ నేతలు నియోజకవర్గాల్లో విస్త్రుతంగా పర్యటిస్తూ టీఆర్ఎస్ వైఫల్యాలను ఎత్తి చూపుతున్నారు.

దీంతో గులాబి శ్రేణుల ఆందోళన రెట్టింపు అవుతోంది. విపక్షాలు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేసీఆర్ స్టైల్ లో ఆంధ్ర పార్టీలను, చంద్రబాబు నాయుడిని విమర్శిస్తున్నా ఫలితం పెద్దగా కనిపించట్లేదు. ఓటర్ల నుంచి ఎదురవుతున్న విమర్శలను అధిగమించాలంటే కేసీఆర్ తో బహిరంగ సభలు నిర్వహించడమే సరైన మార్గమని టీఆర్ఎస్ అభ్యర్ధులు భావిస్తున్నారు. కానీ కేసీఆర్ పర్యటనలు ఇంకా ఖరారు కాలేదు. జిల్లా సభల తర్వాత నియోజకవర్గ పర్యటనలుంటాయని కేసీఆర్ చెప్పినా.. దశరా, బతుకమ్మ, దీపావళి సందర్భంగా వాటిని వాయిదా వేశారు.. పండగ సీజన్ ముగిసిన తర్వాతే తెలంగాణ వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు.

మరో వైపు ప్రచార ఖర్చులను అభ్యర్ధులుకు తలకు మించిన భారంగా మారుతోంది.. నవంబర్ లోనే ఎన్నికలు ఉంటాయని భావించిన అభ్యర్థులు గత నెలరోజులుగా భారీగా ఖర్చు చేసి ప్రచారం నిర్వహించారు.. బైక్ ర్యాలీలు, భారీ జనసమీకరణల కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేశారు. అయితే ఎన్నికలు కాస్త వెనక్కి వెళ్లడంతో ప్రచార ఖర్చు మరింత పెరిగాయి.. ఇక పార్టీ పెద్దల అంచనాలకు అనుగుణంగా ప్రచారం చేయకపోతే బీఫాం వస్తుందో రాదో అన్న టెన్షన్ అభ్యర్థుల్లో ఉంది అందుకే ఖర్చుకు వెనకాడకుండా భారీగా ప్రచారం చేస్తున్నారు ఇక మరో 50 రోజుల ప్రచారం మిగిలి ఉండటంతో. ఎంత ఖర్చు చేయాల్సి వస్తుందోనని అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది.

వీటన్నిటినీ అధిగమించాలంటే వీలైనంత త్వరగా కేసీఆర్ చేత తమ నియోజకవర్గాల్లో ప్రచారం చేయించడం ఒకటే మార్గమని టీఆర్ఎస్ నాయకులు భావిస్తున్నారు కేసీఆర్ ప్రచారంతో ఓటర్లలో ఊపు రావడంతో పాటు పార్టీ తరపున ప్రచార ఖర్చులు అందుతాయని టీఆర్ఎస్ నాయకులు ఆశపడుతున్నారు. కానీ బిగ్ బాస్ మాత్రం సలహాలు మాత్రమే ఇస్తున్నారు దీంతో టీఆర్ఎస్ నాయకులు ఏమీపాలుపోని పరిస్థితి ఎదురవుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories