తెలంగాణాలో మద్యం ధరలు ఎందుకు పెంచుతున్నారు?

తెలంగాణాలో మద్యం ధరలు ఎందుకు పెంచుతున్నారు?
x
Highlights

సరిగ్గా ఇయర్‌ ఎండ్‌లో లిక్కర్‌ రేట్లను తెలంగాణా సర్కార్‌ ఎందుకు పెంచింది? న్యూఇయర్‌ సెలబ్రేషన్స్‌లో మందు ఎక్కువ తాగుతారు కాబట్టి రేట్లు పెంచితే వాడకం...

సరిగ్గా ఇయర్‌ ఎండ్‌లో లిక్కర్‌ రేట్లను తెలంగాణా సర్కార్‌ ఎందుకు పెంచింది? న్యూఇయర్‌ సెలబ్రేషన్స్‌లో మందు ఎక్కువ తాగుతారు కాబట్టి రేట్లు పెంచితే వాడకం తగ్గుతుందనా? లేదంటే సందట్లో సడేమియాలాగా మద్యం మాటున ఆదాయం పెంచుకొనే ప్రయత్నమా? ఇవన్నీ కాదట. జీఎస్టీ ప్రభావంతో రాష్ట్ర ఖజానాకి పడిన గండి పూడ్చుకోవడానికే మద్యం ధరలు పెంచుతున్నారట.

జీఎస్టీ ప్రభావంతో రాష్ట్ర ఖజానాకు భారీగా గండిపడడంతో ఆదాయాన్ని సమకుర్చుకునే పనిలోపడింది కేసీఆర్ సర్కార్. అందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మద్యం ధరలను పెంపు నిర్ణయం తీసుకుంది. సామాన్యులపై భారం పడకుండ మధ్య తరగతి, ఉన్నత వర్గాలు తీసుకునే లిక్కర్ పైనే ధరలు పెంచే విధంగా నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ మార్చి నాటికి రూ.225 కోట్లు అదనంగా ఆదాయం సమకుర్చుకునేందుకు మద్యం ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

తెలంగాణలో పెద్ద యెత్తున అమలవుతున్న అభివృద్ది, సంక్షేమ పథకాల అమలకు నిధులు కొరత రాకుండా ఉండేందుకు రెవెన్యూ శాఖ అధికారులు అనేక ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతున్నారు. మద్యం ధరలను పెంచి రాష్ట్ర ఖజానా లోటును భర్తీ చేసేందుకు ప్లాన్ చేశారు. జీఎస్టీ 23 వ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్నా నిర్ణయాల మూలంగా పన్ను స్లాబ్ రేట్లు భారీగా తగ్గాయి. దీని ప్రభావంతో నెలకు సుమారు రూ.75 కోట్ల మేర అదాయం తగ్గుతోంది. మార్చి నెలాఖరుకి రూ.225 కోట్ల తగ్గుతుందని అధికారుల అంచనా.

ఇక మోజార్టీ ప్రజల నుండి వ్యతిరేక రాకుండా రెవెన్యూ అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. చీప్ లిక్కర్, బీర్లుపై పెంపు లేకుండా జాగ్రత్త పడ్డారు. ధనిక వర్గాలు సేవించే ప్రీమియం బ్రాండ్లు, స్కాచ్‌, దేశీయంగా తయారయ్యే విదేశీ మద్యంపై బేసిక్ ప్రైస్‌లో 9 శాతం శాతం పెంచారు. మార్చి నెలాఖరు నాటికి మొత్తంగా అబ్కారీ ఆదాయం రూ.20 వేల కోట్ల మార్క్‌ దాటాలని అధికారులు టార్గెట్‌ పెట్టుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories