కేసీఆర్ ను హరీష్ ఎందుకు పిలవలేదో!!

కేసీఆర్ ను హరీష్ ఎందుకు పిలవలేదో!!
x
Highlights

ఒకప్పుడు సిద్ధిపేట అంటే కేసీఆర్.. కేసీఆర్ అంటే సిద్ధిపేట అన్నంతగా పేరు ఉండేది. కాలక్రమంలో.. అది హరీష్ రావు అంటే సిద్ధిపేట అన్నంతగా మారిపోయింది. ఆ...

ఒకప్పుడు సిద్ధిపేట అంటే కేసీఆర్.. కేసీఆర్ అంటే సిద్ధిపేట అన్నంతగా పేరు ఉండేది. కాలక్రమంలో.. అది హరీష్ రావు అంటే సిద్ధిపేట అన్నంతగా మారిపోయింది. ఆ నియోజకవర్గంతో.. హరీష్ రావు పెనవేసుకున్న బంధం కూడా అలాంటిది. అందుకే.. సిద్ధిపేట జిల్లా కేంద్రమయింది. అభివృద్ధిలోనూ దూసుకుపోతోంది. ఇప్పుడు కోమటిచెరువు కళాక్షేత్రం కూడా ఆ జిల్లాలో ప్రత్యేక ఆకర్షణగా మారింది.

రవీంద్రభారతిని మించిన స్థాయిలో ఏర్పాటైన ఈ కళాక్షేత్రం ప్రారంభం నభూతో నభవిష్యత్ అన్నంత స్థాయిలో వైభవంగా జరిగింది. అన్నీ తానై వ్యవహరించిన మంత్రి హరీష్ రావు.. కార్యక్రమాన్ని దిగ్విజయం కూడా చేశారు. కానీ.. అక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ కనిపించకపోవడమే పెద్ద లోటుగా అనిపించింది. హరీష్ రావు కాస్త మనసు పెట్టి కేసీఆర్ ను అడిగి ఉంటే.. ఆయన కూడా హాజరయ్యేందుకు ఒప్పుకునేవారేమో కదా.. అన్న మాట వినిపించింది.

మరికొందరేమో.. సిద్ధిపేట అభివృద్ధిలో తన ముద్ర చూపించుకునేందుకే హరీష్ రావు ఇంతటి ఆర్భాటాన్ని చూపెట్టుకుని ఉంటారన్న అంచనా కూడా వేశారు. అసలే.. టీఆర్ఎస్ లో హరీష్ రావుకూ, సీఎం కొడుకు.. మంత్రి కేటీఆర్ కూ ఆధిపత్య పోరు ఉందన్న రూమర్లు ఇప్పటికే చక్కర్లు కొడుతున్నాయి. ఇలాంటి తరుణంలో.. తన సత్తా ఏంటో చూపించుకునేందుకు అటు కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేయడంతో పాటు.. సిద్ధిపేటను రోల్ మోడల్ గా అభివృద్ధి చేయడమే హరీష్ ఎంచుకున్న మార్గం అయి ఉంటుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

అందుకే.. సిద్ధిపేటలో కోమటిచెరువు కళాక్షేత్రం ప్రారంభానికి సీఎం హాజరుకాకున్నా.. హరీష్ రావు ముందుండి అన్నీ నడిపించి ఉంటారన్న మాట కూడా వినిపిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories