ఆర్ధిక బిల్లు ప్ర‌వేశ‌పెట్టే రోజు ఆర్ధిక మంత్రి చేతిలో సూట్ కేస్ ఎందుకు ఉంటుందో తెలుసా..?

ఆర్ధిక బిల్లు ప్ర‌వేశ‌పెట్టే రోజు ఆర్ధిక మంత్రి చేతిలో సూట్ కేస్ ఎందుకు ఉంటుందో తెలుసా..?
x
Highlights

బడ్జెట్ ప్రవేశపెట్టడానికి పార్లమెంటులోకి వచ్చే ఆర్థికమంత్రి.. మనకు కనిపించే ఫస్ట్ సీన్. ఓ లెదర్ బ్రీఫ్ కేస్ ని పట్టుకుని ఫోటోలో కనిపించడం. ఈ బ్రీఫ్...

బడ్జెట్ ప్రవేశపెట్టడానికి పార్లమెంటులోకి వచ్చే ఆర్థికమంత్రి.. మనకు కనిపించే ఫస్ట్ సీన్. ఓ లెదర్ బ్రీఫ్ కేస్ ని పట్టుకుని ఫోటోలో కనిపించడం. ఈ బ్రీఫ్ కేసుని అలానే భద్రంగా పార్లమెంట్లోకి తీసుకెళ్లి బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభిస్తారు. కానీ బడ్జెట్ పత్రాలను ఆనవాయితీగా బ్రీఫ్ కేసులోనే ఎందుకు తీసుకొస్తారు..? ఆ లెదర్ బ్రీఫ్ కేస్ కి ఉన్న ప్రాధాన్యమేమిటి..? అసలు బడ్జెట్ కు, బ్రీఫ్ కేసుకి ఉన్న లింకేంటి..?

బడ్జెట్ అంటే మాటలు కాదు. అదో ఫైనాన్షియల్ బాక్సింగ్. ఆర్థిక అంశాలతో కుస్తీ పట్టాలి. అదీ భారత్ లాంటి అతి పెద్ద దేశంలో బడ్జెట్ అంటే మామూలు విషయం కాదు. బడ్జెట్ ప్రతీ ఏటా మారిపోతుంటుంది. అలాగే, కొన్నేళ్ల తర్వాత ఆర్థిక మంత్రి కూడా మారిపోతుంటాడు. అయితే, మన స్వతంత్ర భారత దేశంలో ఎప్పుడూ మారనిది బడ్జెట్ బ్రీఫ్ కేస్. పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపట్టే రోజున మంత్రిగారు తాను తెచ్చిన బ్రీఫ్ కేస్ తో ముందుగా ఫోటోలకు ఫోజులిస్తారు. అప్పుడు ఆయన చేతిలో ఓ లెదర్ సూట్ కేస్ దర్శనమిస్తుంది. పార్టీలు, నాయకులు మారిపోతున్నా బడ్జెట్ పేపర్లను ఇలా బ్యాగ్ లో తేవటం మాత్రం మారటం లేదు. దీని వెనుక పెద్ద స్టోరీనే ఉంది.

బడ్జెట్ ను ఫ్రెంచ్ భాషలో బోగెటి అంటారు. ఇంగ్లీషులో దీని అర్థం లెదర్ బ్యాగ్. అయితే, బడ్జెట్ రోజున ఆర్థిక మంత్రులు కేవలం లెదర్ బ్రీఫ్ కేస్ లోనే బడ్జెట్ ను తెస్తూ కనిపిస్తారు..? బోగెట్టిని తీసుకొచ్చే సాంప్రదాయం సుమారు 156 సంవత్సరాల క్రితం మొదలైంది. 1860లో బ్రిటన్ మొదటి ఆర్థిక మంత్రి విలియం ఎవర్ట్ గ్లాడ్ స్టోన్ మొదట బ్రీఫ్కేస్ ద్వారా బడ్జెట్ పత్రాలు తీసుకొచ్చి బడ్జెట్ ప్రవేశపెట్టారు. సుమారు 6 గంటలపాటు జరిగిన ఆయన బడ్జెట్ ప్రసంగంలో అప్పట్లో అదే అతిపెద్ద బడ్జెట్గా పేరుగాంచింది. ఈ లాంగ్ బడ్జెట్కు అవసరమయ్యే పేపర్లను పట్టుకెళ్లడానికి ఖచ్చితంగా బాక్స్ అవసరమవుతుందని ఆయన భావించారు. ఆ తర్వాత నుంచి అందరు మంత్రులు అదే సంప్రదాయాన్ని కొనసాగించారు. దీంతో ఆ చిన్న లెదర్ బ్యాగే దేశాలను ముందుకు నడిపించే స్థాయికి వెళ్లింది.

స్వాతంత్రం వచ్చాక కూడా బడ్జెట్ ప్రవేశపెట్టే విషయంలో మనం బ్రిటీష్ వారు అనుసరించిన సాంప్రదాయన్నే కొనసాగిస్తూ వస్తున్నాం. బడ్జెట్ బ్యాగ్ సంప్రదాయం మొదట మన దేశంలో 1947 నవంబర్ 26న ఆర్కే షణ్ముఖం శెట్టి ప్రవేశపెట్టి, బడ్జెట్ బ్యాగ్ ట్రేడ్ మార్కును కొట్టేశారు. బడ్జెట్ ఫోటోగ్రాఫ్ కూడా శెట్టినే ప్రారంభించారు. ఆయన ప్రవేశపెట్టిన అదే సంప్రదాయాన్ని నేటికీ కొనసాగిస్తున్నారు ఆర్థికమంత్రులు. భారత్ తో పాటు ఇతర దేశాల్లోనూ బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు ఫోటోగ్రాఫర్లకు ఫైనాన్స్ మినిస్టర్లు ఫోజులిచ్చే అనవాయితీ కొనసాగుతోంది. ఉగాండ, జింబాబ్వే, మలేషియాలాంటి దేశాలు కూడా ఈ ఫోటోగ్రాఫ్ సాంప్రదాయన్ని కొనసాగిస్తున్నాయి.

బడ్డెట్ కు బ్రీఫ్ కేస్ తెచ్చే సాంప్రదాయం మారకపోయినా బ్రీఫ్ కేస్ రంగులు మాత్రం మారాయి. 1998-99 బడ్జెట్ సమయంలో ఫైనాన్స్ మినిస్టర్ యశ్వంత్ సిన్హా నలుపు రంగుల్లో లెదర్ బ్యాగ్‌లు తీసుకొచ్చారు. అదే సంప్రదాయాన్ని ఎంతో కీలకమైన ఆర్థిక సంస్కరణల సమయమైన 1991వ సంవత్సరంతో మన్మోహన్ సింగ్ సైతం కొనసాగించారు. అయితే యూపీఏ హయంలో అప్పటి ఆర్థికమంత్రి ప్రణబ్ ముఖర్జీ మాత్రం బ్రిటీష్‌ వారిలా బ్లాక్ రంగు బ్యాగ్ కు బదులు రెడ్ కలర్ బాక్స్ లో బడ్జెట్ పత్రాలు తీసుకొచ్చారు. తర్వాత ప్రతి ఏటా ఆర్థికమంత్రి బడ్జెట్ పేపర్లు తీసుకొచ్చే ఈ బ్యాగ్ రంగుల్లోనూ, రూపురేఖల్లోనూ తేడా కనిపిస్తూ వస్తోంది. ఆర్థికమంత్రిగా అరుణ్ జైట్లీ బాధ్యతలు స్వీకరించినప్పుడు మొదటి రెండు సంవత్సరాలు బ్లాక్, ట్యాన్ రంగుల్లో బ్యాగ్ ను వాడారు. బడ్జెట్ బాక్స్ ను మాత్రం ఆర్థికమంత్రిత్వ శాఖే సేకరిస్తోంది. నాలుగు రంగుల్లో బ్యాగులను ఆర్థికమంత్రి ముందు ఉంచుతుంది. వాటిలో తనకు నచ్చిన రంగును ఆర్థికమంత్రి ఎంచుకుంటారు. అయితే ఈ సారి అరుణ్ జైట్లీ ఏ రంగు బ్యాగులో బడ్జెట్ పత్రాలు తీసుకు వస్తారో చూద్దాం.

Show Full Article
Print Article
Next Story
More Stories