తెలంగాణలో సీఎం ఎవరు...సంచలన విషయాలను వెల్లడించిన ఇండియా టుడే సర్వే...

తెలంగాణలో సీఎం ఎవరు...సంచలన విషయాలను వెల్లడించిన ఇండియా టుడే సర్వే...
x
Highlights

కేసీఆర్‌ ముందస్తు నిర్ణయం సరైందేనా..? తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ మరోసారి కారెక్కిస్తారా..? లేక హస్తానికి చేయూతనిస్తారా..? ఏపీలో ఫ్యాన్‌ స్పీడ్‌కు సైకిల్‌...

కేసీఆర్‌ ముందస్తు నిర్ణయం సరైందేనా..? తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ మరోసారి కారెక్కిస్తారా..? లేక హస్తానికి చేయూతనిస్తారా..? ఏపీలో ఫ్యాన్‌ స్పీడ్‌కు సైకిల్‌ వేగం తగ్గనుందా..? ఏపీ సీఎం పీఠంపై ఎవరిని కూర్చోబెట్టాలని అనుకుంటున్నారు..? తెలుగు రాష్ట్రాల ఓటరు నాడి ఎటువైపు..? సంచలన విషయాలను వెల్లడించిన ఇండియా టుడే సర్వే ఫలితాలు

తెలంగాణ ప్రజలు సీఎం కేసీఆర్‌కే మరోమారు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇండియా టుడే ఆక్సిస్‌ మై పోల్‌ సర్వే వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 8 నుంచి 12 వ తేదీ మధ్యన నిర్వహించిన సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. ఈ సర్వేలో తెలంగాణలోని పలు ప్రాంతాల్లోని 7 వేల 110 మంది నుంచి అభిప్రాయాన్ని సేకరించారు.

మరోసారి కేసీఆర్‌కే ఓటేసేందుకు 43 శాతం మంది ప్రజలు సముఖంగా ఉన్నారని ఇండియా టుడే సర్వే వెల్లడించింది. అలాగే కాంగ్రెస్‌కు 18 శాతం, బీజేపీకి 15 శాతం, కోదండరామ్‌ పార్టీ టీజేఎస్‌కు 6 శాతం, ఎంఐఎంకు 4 శాతం ఓట్లు వస్తాయని వివరించింది. అలాగే కేసీఆర్ పాలనపై 48 శాతం మంది సంతృప్తికరంగా ఉన్నట్లు తెలిపారు. పర్వాలేదని 16 శాతం మంది బాగోలేదని 26 శాతం మంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఇక తెలంగాణలో ప్రధాని మోడీ పనితీరుపై 41 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేయగా మళ్లీ మోడీ ప్రధాని కావాలని 44 శాతం మంది మొగ్గుచూపగా రాహుల్‌ ప్రధాని కావాలని 39 శాతం మంది కోరుతున్నారు. అయితే కేసీఆర్‌ ప్రధాని కావాలని ఏకంగా 11 శాతం మంది జై కొట్టడం గమనార్హం.

మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ పై కూడా ఇండియా టుడే సర్వే ఫలితాలు అత్యంత ఆసక్తిగొలిపే విధంగా ఉన్నాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఏపీలో వైసీపీకి ఓటేస్తామని.. రాష్ట్రవ్యాప్తంగా 43 శాతం మంది వెల్లడించినట్లు.. సర్వే ఫలితాలు తెలిపాయి. అధికార తెలుగుదేశానికి 38 శాతం మంది, జనసేన పవన్‌కు 5 శాతం మంది జై కొట్టారు.

అలాగే చంద్రబాబు సర్కారుపై 33 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేయగా బాగోలేదంటూ 36 శాతం మంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రానికి సీఎంగా జగన్‌ కావాలంటూ 40 నుంచి 41 శాతం కోరగా.. చంద్రబాబుకే తిరిగి అవకాశం కల్పించాలని.. 39 నుంచి 40 శాతం మంది అభిప్రాయాన్ని వెల్లడించారు.

దేశానికి ప్రధానిగా రాహుల్‌ గాంధీ కావాలని.. 44 శాతం మంది సుముఖత వ్యక్తం చేయగా.. మోడీకి 38 శాతం మంది ఓటేశారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయం, ధరల పెరుగుదల, తాగునీరు, నిరుద్యోగం వంటి అంశాలు.. ఓటర్లను ప్రభావితం చేస్తాయని.. ఇండియాటుడే సర్వేలో వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories