ప్రదీప్ చిన్నపిల్లాడు... వదిలేయండి

x
Highlights

నవ్విస్తాడు.. కవ్విస్తాడు.. జోకులేస్తాడు.. పంచ్‌లేస్తాడు.. సలహాలిస్తాడు.. అవగాహన కల్పిస్తాడు.. రోడ్డు మీద మనం ఎలా నడచుకోవాలో.. మన స్టైల్లో.. తన స్టైల్...

నవ్విస్తాడు.. కవ్విస్తాడు.. జోకులేస్తాడు.. పంచ్‌లేస్తాడు.. సలహాలిస్తాడు.. అవగాహన కల్పిస్తాడు.. రోడ్డు మీద మనం ఎలా నడచుకోవాలో.. మన స్టైల్లో.. తన స్టైల్ మిక్స్ చేసి.. మనకర్థమయ్యేలా చెప్తాడు.. అతడే అడ్మిన్ హెచ్. ఎవరీ అడ్మిన్ హెచ్.. అనేగా మీ డౌట్. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వాళ్లందరికీ తెలుసు. ఇప్పుడు ఇంటర్నెట్‌లో అందరి హృదయాలు దోచేస్తున్నాడు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ఫేస్ బుక్ పేజీని.. రన్ చేసే వ్యక్తే అడ్మిన్ హెచ్. ఈ పేజీ స్టార్ట్ చేసి ఎనిమిదేళ్లయినా.. ఈ మధ్యకాలంలోనే అడ్మిన్ హెచ్ హైలెట్ అయ్యాడు. ట్రాఫిక్ రూల్స్ పాటించండి.. అని డైరెక్ట్‌గా చెప్తే ఎవరూ వినరని.. దానికి కొంచెం కామెడీ మిక్స్ చేసి.. పంచ్ ఫిక్స్ చేసి.. పోస్టులు పెడతాడు. ఇక.. అడ్మిన్ హెచ్.. పోస్టులకు మనం సెటైర్లు వేస్తే.. వెంటనే రిటర్న్ కౌంటర్ వేసేస్తాడు. అర్థం పర్థం లేని కామెంట్లు చేస్తే.. అర్థమయ్యే రీతిలో పంచ్ వేస్తాడు. ఫ్రెండ్లీ పోలీస్‍‌ అన్న పదానికి ఇప్పుడు న్యాయం చేస్తున్నాడు అడ్మిన్ హెచ్.

పోస్టులు.. లైకులు, కామెంట్లు, కౌంటర్లే కాదు.. చాటింగ్ కూడా చేస్తాడు. మనం కంప్లైంట్ చేస్తే.. సదరు పోలీస్ స్టేషన్‌కు విషయం చేరవేస్తాడు. వారిపై చర్యలు తీసుకున్న విషయాన్ని మళ్లీ అందరికీ తెలియజేస్తాడు. ఇలా.. ఒక్కటేమిటి.. సోషల్ మీడియా ద్వారా.. జనాలకు అర్థమయ్యే రీతిలో అవగాహన కల్పిస్తున్నాడు అడ్మిన్ హెచ్.

అడ్మిన్ హెచ్.. కామెడీ, పంచ్ టైమింగ్, రైమింగ్ ఎలా ఉంటుందో చెప్పడానికి ఈ ఎగ్జాంపుల్ చాలు. యాంకర్ ప్రదీప్ అభిమాని అయిన ఓ అమ్మాయి.. మా ప్రదీప్‌ని వదిలేయండి.. పాపం చిన్న పిల్లాడు తెలియక చేశాడు.. అని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ పేజీలో కామెంట్ చేసింది. దానికి అడ్మిన్ హెచ్.. అదిరిపోయే రిప్లై ఇచ్చాడు. చిన్న పిల్లాడు ఐతే.. పాలు తాగాలి కానీ.. మందు తాగుతాడా అని కౌంటర్ వేశాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో.. ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేశాడు.

అడ్మిన్ హెచ్ అంటే.. అదో పేరు కాదు. బ్రాండ్‌లా తయారైంది. రోడ్లపై మనం ఎలా ఉండాలో చెప్తాడు.. లేకపోతే.. ఏం చేస్తారో చెప్తాడు. ట్రాఫిక్ రూల్స్ పాటించమని డైరెక్ట్‌గా చెప్పడు. పాటించకపోతే.. ఏమవుతుందో మాత్రమే చెప్తాడు. అందుకే.. అడ్మిన్ హెచ్ పోస్టులు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో.. అడ్మిన్ హెచ్ అంటే పోలీసు కాదు. అందరికీ మంచి ఫ్రెండ్. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ పేజీని.. 3 లక్షలకు పైగా ఫాలో అవుతున్నారంటేనే.. అడ్మిన్ హెచ్.. పోస్టులకు ఉన్న క్రేజ్ ఏంటో అర్థమవుతోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories