వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్

nanireddy
Updated on: 24 Dec 2018 4:14 PM IST
వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్
X

ప్రముఖ చాటింగ్ దిగ్గజం వాట్సాప్ తన యూజర్ల కోసం మరో సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. యూజర్లు తమకు వచ్చిన వీడియో మెసేజ్‌లను నోటిఫికేషన్‌ బార్‌లోనే ప్లే చేసుకునే సదుపాయం కల్పించారు. ఐఓఎస్‌, బీటా యూజర్లకు కొత్త అప్‌డేట్‌ను విడుదల చేసింది. ఈ అప్‌డేట్‌లో అయితే ప్రస్తుతానికి బీటా వెర్షన్‌ 2.18.102.5కు అప్‌డేట్‌ అయిన ఐఓఎస్‌ యూజర్లకు మాత్రమే ఈ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే ఆండ్రాయిడ్‌ ప్లాట్‌ఫామ్‌కు కూడా విస్తరిస్తామని వాట్సాప్ ప్రతినిధులు తమ బ్లాగుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను వాడటానికి లేదా ఆపివేయడానికి సెట్టింగ్స్‌లోకి వెళ్లి ప్రివ్యూ మోడ్‌ను ఆఫ్‌ లేదా ఆన్‌ చేసుకుంటే సరిపోతుంది.

nanireddy

nanireddy

Next Story