లడ్డూ కావాలా..నాయనా!.. సైట్ ఓపెన్ చేయగానే కవ్వించే అందగత్తెలు!

x
Highlights

లడ్డూ కావాలా అంటూ ఫోన్‌కు మెసేజ్ వస్తుంది దానిని ఓపెన్ చేయగానే అందమైన అమ్మాయి ఫోటో కనిపిస్తుంది. దానికిందే వాట్సాప్ నంబర్ ఉంటుంది. అంతే ఆశపడి ఆగలేక...

లడ్డూ కావాలా అంటూ ఫోన్‌కు మెసేజ్ వస్తుంది దానిని ఓపెన్ చేయగానే అందమైన అమ్మాయి ఫోటో కనిపిస్తుంది. దానికిందే వాట్సాప్ నంబర్ ఉంటుంది. అంతే ఆశపడి ఆగలేక ఫోన్ చేస్తే కవ్వించే స్వీట్ వాయిస్ వినిపిస్తుంది. ఆ తర్వాత తనతో గడిపేందుకు 3 వేల నుంచి 7 వేల దాకా బేరాలు కొనసాగుతాయి. తర్వాత ఆన్‌లైన్‌లో అకౌంట్‌లో డబ్బులు వేస్తే డీల్ ఓకే అయినట్టే. అలా డబ్బులు అకౌంట్‌లో పడగానే వాట్సాప్‌లో లొకేషన్ షేర్ చేస్తారు. తీరా అక్కడికి వెళ్లి చూస్తే తెలుస్తుంది. అక్కడెవరూ ఉండరు. అప్పుడు అర్థమవుతుంది అంతా ఫేక్ అని. ఈ విషయం బయటకు చెబితే పరువు పోతుందని కొందరు యువకులు సైలెంట్‌గా ఉంటే మరికొందరు మాత్రం పోలీసులకు తమ గోడు వెళ్లబోసుకున్నారు.

కొందరి బలహీనతలనే బిజినెస్‌గా మార్చుకుంటున్న కొందరు కేటుగాళ్లు ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్నారు. ఈ మోసానికి బేగంపేటలోని ఓ అపార్ట్‌మెంట్ అడ్రస్‌ను వాడుకుంటున్నారు. ఫోటోలు పంపడం ఎకౌంట్‌లో డబ్బులు వేయించుకోవడం బేగంపేటలోని అపార్ట్‌మెంట్ అడ్రస్ వాట్సాప్‌లో షేర్ చేయడం. ఇలా మోసపోయిన వాళ్లంతా అపార్ట్‌మెంట్‌కు వెళ్లాక అసలు విషయం అర్థమై తిరిగి వెళ్లిపోతున్నారు.

ఆన్ లైన్ కేటుగాళ్ల దెబ్బకు బేగంపేటలోని అపార్ట్‌మెంట్ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా రోజుకు చాలా మంది రావడం డోర్లు కొట్టడం అడగరాని విషయం అడగడంతో ఫ్యామిలీలు ఇబ్బందిపడుతున్నాయి. అపార్ట్‌మెంట్‌లోని మగాళ్లంతా ఆఫీసులకు వెళ్లడం మానేసి ఇప్పుడు ఇళ్లలోనే ఉంటున్నారు. వచ్చి డోర్లు కొట్టిన వాళ్లందరికీ అసలు విషయం చెప్పి పంపిస్తున్నారు.

ఈ ఇబ్బంది పడలేక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పెట్రోలింగ్ ఏర్పాటు చేశారు. నెల వ్యవధిలో వంద మందికి పైగా యువకులు అపార్ట్‌మెంట్‌కు రావడం గమనించారు. అలా కొందరి దగ్గర్నుంచి నెంబర్ సేకరించి ట్రాప్ చేసేందుకు ప్రయత్నించారు. అలా ఒకరోజు చెన్నైలో, మరో రోజు బెంగళూరులో, ఇంకోసారి నాగ్‌పూర్‌లో ఇలా రోజుకో చోట ట్రేస్ అవుతుండటంతో పోలీసులు ఈ కేసును క్రైమ్ బ్రాంచ్‌కు అప్పగించారు.

ఓ వెబ్ సైట్ పెట్టుకొని దానిద్వారా ఈ దందా నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇది ఒకరే చేస్తున్నారా లేక ముఠాగా ఏర్పడి చేస్తున్నారా అన్న కోణంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదంతా చేస్తోంది అమ్మాయా ఆమె వెనుక ఓ టీమ్ ఉందా అన్న కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories