రేవంత్ రెడ్డి కేసు ఏ మలుపు తిరగబోతోంది..లాయర్ రామారావు ...

x
Highlights

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్న రేవంత్ రెడ్డి కేసు ఏ మలుపు తిరగబోతోంది..? రామారావు అనే లాయర్ రేవంత్‌పై చేసినవన్నీ ఆరోపణలేనా..?...

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్న రేవంత్ రెడ్డి కేసు ఏ మలుపు తిరగబోతోంది..? రామారావు అనే లాయర్ రేవంత్‌పై చేసినవన్నీ ఆరోపణలేనా..? అందుకు రుజువుతున్నాయా..? 43 గంటల పాటు సోదాలు నిర్వహించిన ఐటీ అధికారులకు ఆధారాలేమైనా దొరికాయా..? అక్టోబర్ 3న రేవంత్ ఐటీ అధికారుల విచారణకు హాజరైన తర్వాత ఏం జరగబోతోంది..? ఇప్పుడు ఇమే ప్రశ్నలు తెరపైకి వినిపిస్తున్నాయి.

43 గంటల పాటు సోదాలు..31 గంటల పాటు విచారణ.. 150 ప్రశ్నలు..3 సూట్ కేసుల్లో కీలక డాక్యుమెంట్లు..ఇదీ రేవంత్, ఆయన బంధువుల నివాసాల్లో ఐటీ సోదాలు జరిగిన తీరు. ఐటీ అధికారులు సోదాలు ముగించి వెళ్తూ, వెళ్తూ అక్టోబర్ 3న విచారణకు హాజరుకావాలని రేవంత్‌ కు నోటీసులు ఇచ్చి వెళ్ళడం ఆసక్తిగా మారింది. అక్టోబర్ 3 విచారణ ఒక్క రోజులోనే ముగుస్తుందా..? రెండు మూడు రోజుల పాటు ఐటీ అధికారుల ప్రశ్నావళి సాగుతుందా..? ఈ ఘట్టం విచారణతో ముగిస్తుందా అరెస్టు వరకు వెళ్తుందా అనే ఉత్కంఠ రేపుతోంది.

నిజానికి ఐటీ అధికారులు తీసుకెళ్ళిన డాక్యుమెంట్లకు సంబంధించి అక్టోబర్ 3న ఐటీ అధికారులు రేవంత్‌ పై ప్రశ్నలు సంధిస్తారు. వారి అనుమానాలను రేవత్ నివృత్తి చేయాల్సి ఉంటుంది. అయితే అసలు ఐటి అధికారులు ఏఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్లారు ఏఏ అంశాలకు జవాబు ఇవ్వాల్సి వుంటుందో తెలియదు కాబట్టి..ఆయా డాక్యుమెంట్లకు సంబందించి నకలు కాపీలను తీసుకునే హక్కు రేవంత్‌కు ఉంటుందని నిపుణులు అంటున్నారు. అలాగే ఆ డాక్యుమెంట్లకు సంబంధించి అంశాల వారీగా వివరణ ఇవ్వొచ్చు లేదంటే..విచారణకు కొంత సమయం అడిగే అవకాశం కూడా వుంటుందని చెబుతున్నారు.

రేవంత్‌కు సంబంధించి లెక్కచూపని ఆస్తుల విలువ 20 కోట్ల రూపాయలుగా వుందని సమాచారం. అది కూడా ఆయన బావమరిది పేరున వున్న కంపెనీకి సంబందించినవేనని తెలుస్తోంది. 20 కోట్లకు సంబందించిన విచారణలో ఐటీ అధికారులకు సంతృప్తికర సమాచారం ఇస్తే రేవంత్‌కు క్లీన్ చిట్ వచ్చినట్లే. అక్రమాస్తుల లెక్క తేలకపోతే మాత్రం ఆ మొత్తంపై 30 శాతం అపరాధ రుసుము చెల్లించాల్సి వుంటుందని ఆదాయపు పన్ను నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి కేసులో ఆరెస్ట్ కు అవకాశమే లేదని అంటున్నారు.

మరొక కీలకమైన అంశం హవాలా వ్యవహారం. హైదరాబాద్ లోని రేవంత్ నాలుగు అంతస్తుల ఇంటి అడ్రస్‌‌తో ఎన్నో కంపెనీల అడ్రస్‌లు ఉన్నట్లు చెబుతున్నారు. అయితే అవన్నీ తన ఇంట్లో అద్దెకు ఉన్నవారి కంపెనీలనీ తనకు సంబంధం లేదని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. అదే నిజమైతే ఎలాంటి సమస్యా ఉండదు. కానీ ఈ డొల్ల కంపెనీల ద్వారా అక్రమ లావాదేవీలు జరిగినట్లు తేలితే మాత్రం కేసు తీవ్రత పెరిగే అవకాశం ఉంది. అలాగే రేవంత్ ఆస్తులకు సంబంధించి ప్రస్తుత మార్కెట్ విలువ ఎంత.. వారు కొనుగోళ్లు చేసే సమయంలో ఆయా అస్తుల విలువ ఎంత..దానికి అంత ఆదాయం ఎక్కడ నుంచి వచ్చింది..అనే లెక్కలు సరిగా చూపిస్తే రేవంత్‌కు ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆదాయపు పన్ను నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ఓటుకు నోటు కేసులో స్టీఫెన్ సన్ కు ఇచ్చినట్లు చెబుతున్న 50 లక్షల రూపాయలు ఎక్కడివి ఆ డబ్బు ఎవరిచ్చారనే అంశాలకు సంబందించి కూడా స్పష్టత రావాల్సి ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories