పశ్చిమ గోదావరి జిల్లాలో పడమటి సంధ్యారాగం

పశ్చిమ గోదావరి జిల్లాలో పడమటి సంధ్యారాగం
x
Highlights

వాళ్లిద్దరూ వేర్వేరు దేశాస్తులు. మతాలు, సంస్కృతులు కూడా వేర్వేరు. కానీ వారిద్దరిని ప్రేమ కలిపింది. పెళ్లి కోసం తమ కుటుంబాలను ఒప్పించారు. పశ్చిమగోదావరి...

వాళ్లిద్దరూ వేర్వేరు దేశాస్తులు. మతాలు, సంస్కృతులు కూడా వేర్వేరు. కానీ వారిద్దరిని ప్రేమ కలిపింది. పెళ్లి కోసం తమ కుటుంబాలను ఒప్పించారు. పశ్చిమగోదావరి జిల్లాలో స్థానిక యువకుడు, ఫ్రాన్స్ యువతితో జరిగిన పెళ్లిపై స్పెషల్ స్టోరీ. ఈ నవవధువు పేరు సెరిన్ జరిత కాల్డేరోన్. ఈమె ఫ్రాన్స్ యువతి. పెళ్లి పీటలపై కూర్చున్న ఈ వరుడి పేరు సత్యనారాయణ. ఇతను పశ్చిమ గోదావరి జిల్లా వాసి. ఉద్యోగరీత్యా సత్యనారాయణ ఫ్రాన్స్ లో వుండగా సెరిన్ పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి కోసం ఇద్దరూ తమ తల్లిదండ్రులను ఒప్పించారు. వివాహం ఇండియాలో చేసేందుకు నిశ్చయించారు.

సత్యనారాయణతో సెరిన్ కల్యాణం జరిపించేందుకు ఆమె కుటుంబసభ్యులు ఫ్రాన్స్ నుంచి పశ్చిమ గోదావరి జిల్లా వేలివెన్నుకు తరలివచ్చారు. సెరిన్ తల్లి నుదుట బొట్టు పెట్టుకుని, చీర ధరించగా, తండ్రి పంచె కట్టారు. మన దేశపు సాంప్రదాయం ప్రకారం సత్యనారాయణ, సెరిన్ ల పెళ్లి వైభవంగా జరిగింది. ఈ మ్యారేజ్ తర్వాత రిసెప్షన్ జరిగింది. స్థానిక సింగర్స్ తో కలిసి పాత తెలుగు పాటలకు ఫ్రాన్స్ మహిళలు చీర ధరించి జోరుగా స్టెప్పులేశారు. కొత్త దంపతులు గొంతు కలిపారు. నృత్యాలతో సత్యనారాయణ, సెరిన్ దంపతులు బంధుమిత్రులను ఆనందంలో ముంచెత్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories