దిల్ రాజు ఇంట పెళ్లి సందడి.. వధువు వైసీపీ ఎమ్మెల్యే కూతురు

nanireddy
Updated on: 24 Dec 2018 4:41 PM IST
దిల్ రాజు ఇంట పెళ్లి సందడి.. వధువు వైసీపీ ఎమ్మెల్యే కూతురు
X

సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. లవర్ సినిమాతో నిర్మాతగా మారిన దిల్ రాజు సోదరుడు కుమారుడు హర్షిత్ రెడ్డి వివాహం గౌతమితో ఈనెల 21 గోవాలో జరగనుంది. అనంతరం హైదరాబాద్ లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ పెళ్లికి టాలీవుడ్ కి చెందిన కొంతమంది దర్శక నిర్మాతలతో పాటు హీరోలకి కూడా ఆహ్వానం అందిందని తెలుస్తోంది. హర్షిత్ పెళ్లి చేసుకోబోయే ఆదోని వైసీపీ ఎమ్మెల్యే వై సాయి ప్రసాద్ రెడ్డి కూతురు. కాగా ఈనెల 23న హైదరాబాద్ లో వివాహ విందు ఏర్పాటు చేయబోతుంది దిల్ రాజు ఫ్యామిలీ.. ఈ కార్యక్రమానికి రాజకీయ, సినీ ప్రముఖులు హాజరవుతారని సమాచారం.

nanireddy

nanireddy

Next Story