మరో నాలుగు రోజులు అల్లకల్లోల పరిస్థితులు

మరో నాలుగు రోజులు అల్లకల్లోల పరిస్థితులు
x
Highlights

వాతావరణంలో మార్పుల కారణంగా దేశంలో అల్లకల్లోల పరిస్థితులు...మరో నాలుగు రోజులు కొనసాగే అవకాశముందని కేంద్ర వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ్టీ నుంచి ఈ నెల 8వ...


వాతావరణంలో మార్పుల కారణంగా దేశంలో అల్లకల్లోల పరిస్థితులు...మరో నాలుగు రోజులు కొనసాగే అవకాశముందని కేంద్ర వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ్టీ నుంచి ఈ నెల 8వ తేదీ వరకు పలు రాష్ట్రాలకు గాలివాన ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది. జమ్మూ కశ్మీర్‌, హరియాణా, హిమాచల్ ప్రదేశ్‌, చండీగఢ్, ఢిల్లీ, పంజాబ్, ఉత్తరప్రదేశ్‌, బిహార్, ఝార్ఖండ్, రాజస్థాన్, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

కొమరిన్‌ ఏరియాలో తమిళనాడు మీదుగా ఉపరితలంలో ద్రోణి కొనసాగుతోందని కర్ణాటక వరకు వాతావరణ శాఖ అధికారి రాజారావు తెలిపారు. ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో....క్యుములోనింబస్‌ మేఘాల ప్రభావంతో ఈదురుగాలులతో పాటు వర్షాలు కురుస్తాయని ఆయన తెలిపారు. వచ్చే ఐదు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని రాజారావు చెప్పారు. రాయలసీమలో 42 డిగ్రీలు, కోస్తాంధ్రలో 33 నుంచి 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపారు, తెలంగాణలోని ఆదిలాబాద్‌, మెదక్, నిజామాబాద్‌లలో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని రాజారావు తెలిపారు.

కర్ణాటకలోని దక్షిణ ప్రాంతంతో పాటు నాగాలాండ్, మణిపూర్, త్రిపుర రాష్ట్రాల్లో కుండపోత వర్షం కురిసే అవకాశముందని కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరించింది. రాజస్థాన్‌‌లో గాలి దుమారం ప్రభావం మరో మూడు ఉంటుందని స్పష్టం చేసింది. గాలి దుమారంతో ఇప్పటి వరకు 134 మంది ప్రాణాలు కోల్పోగా, వందల మంది గాయపడ్డారు.

Show Full Article
Print Article
Next Story
More Stories