లేటా.. రైటా..

లేటా.. రైటా..
x
Highlights

హోదా కోసం ఎందాకైనా.. అంటూ నాలుగేళ్లుగా ధర్నాలు, దీక్షలు, ఆందోళనలతో అట్టుడికించిన వైసిపి.. క్లైమాక్స్ లో వ్యూహం రచించలేక బొక్క బోర్లా పడిందా? రాజీనామాల...

హోదా కోసం ఎందాకైనా.. అంటూ నాలుగేళ్లుగా ధర్నాలు, దీక్షలు, ఆందోళనలతో అట్టుడికించిన వైసిపి.. క్లైమాక్స్ లో వ్యూహం రచించలేక బొక్క బోర్లా పడిందా? రాజీనామాల అస్త్రాన్ని లాస్ట్ మినిట్ లో తీసి.. టిడిపికి అడ్వాంటేజ్ అందించిందా?

హోదా కోసం రాజీనామాలు చేయాలన్న అస్త్రాన్ని వైసిపి లేటుగా సంధించిందా? గతంలోనే రాజీనామాలకు సిద్ధమని ప్రకటించిన జగన్ ఇన్నాళ్లూ వారిచేత రాజీనామా చేయించకుండా ఇప్పుడు చివరి ఏడాదిలో చేయించడం వల్ల ఉపయోగమేంటనే సందేహాలు వైసిపి నేతలనుంచే ఎదురవుతున్నాయి. రాజీనామా అస్త్రాన్ని చాలా ఆలస్యంగా ప్రకటించారని ఇది జగన్ ఆడుతున్న రాజకీయ డ్రామా అంటూ టిడిపి మండిపడుతోంది.

2016లోనే ఎంపీలు రాజీనామా చేస్తారని ప్రకటించిన జగన్ ఇన్నాళ్లూ దఫ దఫాలుగా పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నా ఎప్పుడూ రాజీనామా అంశాన్ని ప్రస్తావించలేదు..బడ్జెట్ సమావేశాల్లో లోక్ సభలో మిథున్ రెడ్డి, రాజ్యసభలో విజయ సాయి రెడ్డి నిరసన తెలిపి.. రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ప్రస్తావించారు.. రాజీనామా చేయిస్తానన్న వైసిపి మాటలకే కట్టుబడి ఉందని అధికార పక్షం మాటల దాడి చేస్తున్న సమయంలో పవన్ కల్యాణ్ తెరపైకి రావడం.. ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాల్లో కదలిక వచ్చింది. దాంతో నెల్లూరు జిల్లా కనిగిరిలో పాదయాత్రలో ఉన్న జగన్ తన శ్రేణులతో అత్యవసర భేటీ నిర్వహించారు.. మార్చి 1న రాష్ట్రంలో ధర్నా, మార్చి 5న జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయాలని నిర్ణయించారు.. అయితే రాజీనామాలు మాత్రం పార్లమెంటు సమావేశాలు అయిపోయాక ఏప్రిల్6న చేయాలని నిర్ణయించారు.. ఈనెల్లాళ్లూ పార్లమెంటులో ఆందోళనలు చేయాలని ఆదేశించారు.. అయితే వైసిపి వ్యూహంలో ఉన్న ఈ గ్యాప్ ని టిడిపి అడ్వాంటేజ్ గా తీసుకుంది.. మార్చి 5న టిడిపి కూడా ఢిల్లీలో ధర్నాలు, నిరసనలు చేపట్టాలని నిర్ణయించింది. మార్చి 6న అవసరమైతే అప్పటి పరిస్థితులను బట్టి టిడిపి ఎంపీలు, మంత్రులు రాజీనామా చేయాలనే ఆలోచన టిడిపి చేస్తోంది. ఇన్నాళ్లూ మౌనంగా ఉండి.. ఇప్పుడు రాజీనామాలు చేస్తామనడం ఒట్టి డ్రామాయేనంటోంది టిడిపి..పైగా ఎంపీలు రాజీనామా చేస్తే ఒరిగేదేమీ ఉండదని, మంత్రులు రాజీనామా చేయడం, ఎన్డీఏ నుంచి బయటకు రావడం పెద్ద విషయమని టిడిపి ప్రచారం చేసుకుంటోంది.

కాబట్టి టిడిపి మంత్రులు గనక ముందు రాజీనామాలు చేస్తే.. జగన్ శిబిరం ప్లాన్ ఫ్లాప్ షోగా మిగిలిపోతుంది. నిజానికి ఏపికి హోదాయే సంజీవని అని చాలా సార్లు జగన్ ప్రకటించారు.. హోదా డిమాండ్ తో గత నాలుగేళ్లుగా యువభేరీలు, ధర్నాలు, దీక్షలు చేస్తూ.. పోరాట పంథా అవలంబించారు. హోదా కోసం ఒక ప్లాన్ ప్రకారం ఇన్ని కార్యక్రమాలు చేపట్టి క్లైమాక్స్ సీన్ కొచ్చే సరికి జగన్ వ్యూహం దెబ్బతిందా అనే సందేహం వైసిపి శ్రేణులను తినేస్తోంది. పైకి మాత్రం చంద్రబాబు వల్లనే రాష్ట్రానికి ఈ గతి పట్టిందని పైకి విమర్శిస్తున్నారు.
మొత్తం మీద రాజీనామాల పై అందరికన్నా ముందు ప్రకటన చేసిన వైసిపి.. ఆచరణలో వెనకబడిపోయి.. మైలేజి కోల్పోతోందేమోననే సందేహం అటు రాజకీయ విశ్లేషకులనుంచీ వ్యక్తమవుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories