అబ్బే విష‌య‌మే లేదు

అబ్బే విష‌య‌మే లేదు
x
Highlights

ప‌వన్ క‌ల్యాణ్ కు యుద్ధ‌తంత్రం తెలియ‌ద‌ని విమర్శకులు దెప్పిపొడుతున్నారు. క్రిటిక్ మ‌హేష్ క‌త్తి - ప‌వ‌న్ క‌ల్యాణ్ ల వివాదం తారాస్థాయిలో ఉన్న విష‌యం...

ప‌వన్ క‌ల్యాణ్ కు యుద్ధ‌తంత్రం తెలియ‌ద‌ని విమర్శకులు దెప్పిపొడుతున్నారు. క్రిటిక్ మ‌హేష్ క‌త్తి - ప‌వ‌న్ క‌ల్యాణ్ ల వివాదం తారాస్థాయిలో ఉన్న విష‌యం తెలిసిందే. అయితే ఆ వివాదాన్ని ప‌వ‌న్ చ‌ల్లార్చే ప్ర‌య‌త్నం చేయ‌కుండా మ‌హేష్ తో భీక‌ర‌మైన పోరాటం ఎందుకు చేస్తున్నార‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ఎప్పుడైనా ఓ స‌మ‌స్య వ‌చ్చిందంటే ఆస‌మ‌స్య‌ను అదిలోనే తుంచేయ్యాలి. లేదంటే స‌ద‌రు సంబంధిత వ్య‌క్తుల్ని దెప్పిపొడుస్తుంటుంది. ఇప్పుడు ఇదే త‌రహ స‌మ‌స్య‌ను ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎదుర్కొంటున్న‌ట్లు నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.
పవర్ స్టార్ ని శిఖరంతో పోలుస్తున్న పవన్ కళ్యాణ్ ఫాన్స్ సోష‌ల్ మీడియాలో త‌మ అభిప్రాయం ప్ర‌కారం వెంట్రుకనేసి కొండను లాగుతున్న కత్తి మహేష్ స‌మ‌స్య‌ను అదిలోనే ప‌రిష్కరించుకుంటే బాగుండేద‌న‌ని అంటున్నారు. కాబ‌ట్టే క‌త్తి మ‌హేష్ ఆరోప‌ణ‌లు చేస్తూ ఎదురుదాడికి దిగుతున్నార‌ని కామెంట్ చేస్తున్నారు. దోబూచులాటకే పరిమితమైన ప‌వ‌న్.. కత్తి మహేష్ జోలికి పోకండి అంటూ స్పష్టమైన ట్వీట్ ఒక్కటి చేసినా.. ఈ పాటికి అంతా చల్లబడిపోయ్యేదని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లోనే వినిపిస్తున్నమాట

Show Full Article
Print Article
Next Story
More Stories