వివాహ భోజనంబు వింతైన వంటకంబు!

వివాహ భోజనంబు వింతైన వంటకంబు!
x
Highlights

మంచి భోజనం తినటం అనగానే గుర్తుకు వచ్చే పాట...వివాహ భోజనంబు వింతైన వంటకంబు అనే ఈ పాట. ఈ పాట 1957లో విడుదలైన తెలుగు చలనచిత్రం మాయాబజార్లో పాట. ఈ పాటను...

మంచి భోజనం తినటం అనగానే గుర్తుకు వచ్చే పాట...వివాహ భోజనంబు వింతైన వంటకంబు అనే ఈ పాట. ఈ పాట 1957లో విడుదలైన తెలుగు చలనచిత్రం మాయాబజార్లో పాట. ఈ పాటను పింగళి నాగేంద్రరావు గారు మాయాబజార్ (1957) సినిమా కోసం రచించారు. ఈ పాటను మాధవపెద్ది సత్యం పాడగా, ఘంటసాల వెంకటేశ్వరరావుసంగీతాన్ని అందించారు. చాయాగ్రాయకుడు మార్కస్ బార్ట్లే సినిమాలో ఈ పాటను వంటశాలలో ఎస్వీ రంగారావు పై చిత్రీకరించారు. ఈ పాటలో తెలుగువారి పెళ్ళి భోజనాలలోని వంటకాలను పేర్కొన్నారు. గారెలు, బూరెలు, అరిశెలు, లడ్డులు, అప్పడాలు, ధప్పడాలు, పాయసాలు మున్నగు వంటలను చూపించారు కూడా. ఈ పాట విన్నా...చూసిన కూడా ఆకలి వేసేస్తుంది.
హహ్హహహ్హహహ్హహా.. వివాహభోజనంబు అహ్హహ ఆ.

పల్లవి: వివాహ భోజనంబు వింతైన వంటకంబు
వియ్యాలవారి విందు ఓ హోహ్హొ నాకె ముందు | వివాహ |
అహహ్హహహ్హహహ్హ అహహ్హహహ్హహహ్హ అహహ్హహహ్హహ

చరణం: ఔరౌర గారెలల్ల అయ్యారె బూరెలిల్ల | ఔరౌర |
ఓహ్హోరె అరెసెలుల్ల హహహ్హహహ్హహా
ఇయెల్ల నాకె చెల్ల
వివాహ భోజనంబు వింతైన వంటకంబు
వియ్యాలవారి విందు ఓహోహ్హొ నాకె ముందు
అహహ్హహహ్హహహ్హ అహహ్హహహ్హహహ్హ అహహ్హహహ్హహ
చాల పెండ్లిలల్లో ఈ పాట వినబడుతూనే వుంటుంది. శ్రీ.కో.

Show Full Article
Print Article
Next Story
More Stories