విశాల్ అదే ఊపును కొనసాగిస్తాడా..

విశాల్ అదే ఊపును కొనసాగిస్తాడా..
x
Highlights

దాదాపు పన్నెండు ఏళ్ల కిందట వచ్చిన ‘పందెంకోడి’ చిత్రం విశాల్ కెరీర్ లో భారీ హిట్ ను సాధించింది. పైగా తెలుగులో ఒకటి రెండు చోట్ల ఈ చిత్రం 175 రోజులు...

దాదాపు పన్నెండు ఏళ్ల కిందట వచ్చిన ‘పందెంకోడి’ చిత్రం విశాల్ కెరీర్ లో భారీ హిట్ ను సాధించింది. పైగా తెలుగులో ఒకటి రెండు చోట్ల ఈ చిత్రం 175 రోజులు ఆడింది. విశాల్‌–లింగుస్వామి కాంబినేషన్ కావడం, పైగా ఫ్యాక్షన్ నేపథ్యంలో వచ్చిన చిత్రం కావడంతో ఈ సినిమా అప్పట్లో భారీ హిట్ ను సాధించింది. అయితే అదే స్పూర్తితో ఈ చిత్రానికి సీక్వెల్ పందెంకోడి 2 వస్తోంది. ఇందులో విశాల్ సరసన కీర్తి సురేష్ నటిస్తోంది. ఇటీవల మహానటిలో అద్భుతమైన నటన కనబరచిన కీర్తి.. ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. సోషల్ మీడియాలో ఇప్పటికే పందెంకోడి హవా మొదలైంది. అభిమన్యుడు సక్సెస్ తో ఆనందంలో ఉన్న విశాల్ అదే ఊపును కొనసాగిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. కాగా ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్‌కుమార్, రాజ్‌కిరణ్‌ కీలక పాత్రల్లో నటించడంతో క్రేజ్ఏర్పడింది. అక్టోబర్ 18న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 1000 కి పైగా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వస్తుండగా.. ఇటీవల విడుదలైన ట్రైలర్ కు అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories