విశాల్ నామినేషన్ తిరస్కరణ..?

admin
Updated on: 24 Dec 2018 12:15 PM IST

ఆర్కే నగర్‌ ఉప ఎన్నికపై రిటర్నింగ్‌ అధికారి వరుస షాకులు ఇస్తున్నారు. నటుడు విశాల్‌ నామినేషన్‌ను కూడా తిరస్కరించినట్లు ఆయన ప్రకటించారు. కాసేపటి క్రితం ఈ విషయాన్ని ఆయన తెలియజేశారు.

నామినేషనల్‌ లో తప్పిదాలు ఉండటంతోపాటు, వివరాలు సరిగ్గా లేవని రిటర్నింగ్‌ ఆఫీసర్‌ పేర్కొన్నారు. కాగా, స్వతంత్ర్య అభ్యర్థిగా సోమవారం విశాల్‌ నామినేషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు జయలలిత మేనకోడలు దీప జయకుమార్‌ నామినేషన్‌ కూడా తిరస్కరణకు గురైంది. సాంకేతిక కారణాలతో ఆమె నామినేషన్‌ను తిరస్కరించినట్లు అధికారి తెలిపారు.

admin

admin

Next Story