logo
సినిమా

క్యూ క‌డుతున్న విశాల్ సినిమాలు

క్యూ క‌డుతున్న విశాల్ సినిమాలు
X
Highlights

పేరుకి తెలుగువాడైనా.. త‌మిళ చిత్రాల‌కే ప‌రిమిత‌మ‌య్యాడు యువ క‌థానాయ‌కుడు విశాల్‌. 'పందెం కోడి', 'పొగ‌రు',...

పేరుకి తెలుగువాడైనా.. త‌మిళ చిత్రాల‌కే ప‌రిమిత‌మ‌య్యాడు యువ క‌థానాయ‌కుడు విశాల్‌. 'పందెం కోడి', 'పొగ‌రు', 'పూజ' త‌దిత‌ర అనువాద‌ చిత్రాల‌తో తెలుగులోనూ మంచి మార్కెట్ ని సొంతం చేసుకున్న విశాల్‌.. అతి త్వ‌ర‌లో 'డిటెక్టివ్‌'గా ప‌ల‌క‌రించ‌బోతున్నాడు. త‌మిళంలో విజ‌యం సాధించిన 'తుప్ప‌రివాల‌న్'కి ఇది అనువాద రూపం.

ఇదిలా ఉంటే.. తాజాగా త‌న కొత్త చిత్రాల‌కు రిలీజ్ డేట్స్‌ని ఫిక్స్ చేశాడు విశాల్‌. 'డిటెక్టివ్‌' అక్టోబ‌ర్ 18న విడుద‌ల కానుండ‌గా.. విశాల్‌ తొలి మ‌ల‌యాళ చిత్రం 'విల‌న్' అక్టోబ‌ర్ 19న విడుద‌ల కానుంది. మోహ‌న్‌లాల్‌, రాశి ఖ‌న్నా, హ‌న్సిక ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టించిన ఈ సినిమా అదే రోజు త‌మిళంలో కూడా రిలీజ్ కానుంది. అలాగే స‌మంతతో తొలిసారిగా విశాల్ న‌టిస్తున్న 'ఇరుంబు తిరై' జ‌న‌వ‌రి 12న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. మొత్తానికి విశాల్ సినిమాలు క్యూ క‌డుతున్నాయ‌న్న‌మాట‌.

Next Story