ధైర్యంగా మాట్లాడండీ. మీకు నేను అండగా ఉంటా : హీరో విశాల్

nanireddy
Updated on: 24 Dec 2018 3:29 PM IST
ధైర్యంగా మాట్లాడండీ. మీకు నేను అండగా ఉంటా : హీరో విశాల్
X

సినీ ప్రముఖులు, రైతులకు నేనున్నానంటూ భరోసా ఇస్తున్నాడు ఆ హీరో. తాజాగా దేశవ్యాప్తంగా జరుగుతున్న 'మీ టు' ఉద్యమానికి నడిగర్ సంగం ప్రధాన కార్యదర్శి హోదాలో, హీరో విశాల్ మద్దతు పలికారు. 'ఇదే కరెక్ట్‌ టైమ్‌. సినీ రంగంలో మహిళలు ధైర్యంగా మాట్లాడండీ. మీకు నేను అండగా ఉంటా. భద్రత కల్పించడానికి ఓ కమిటీగా ఏర్పడతాం. లైంగిక వేధింపుల గురించి ధైర్యంగా బయట పెట్టిన చిన్మయి, తనుశ్రీదత్తా తదితరులను గౌరవిస్తున్నా' అని విశాల్‌ ట్వీట్‌ చేశారు. కాగా గతంలో నటి శ్రీరెడ్డి కూడా క్యాస్టింగ్ కౌచ్ పై ఆరోపణలు చేసినప్పుడు ఆధారాలుంటే బయటపెట్టాలని.. కోరాడు. అంతేకాకుండా తన స్నేహితురాలు, నటి వరలక్ష్మి సైతం లైంగిక వేధింపులకు గురైనప్పుడు ఆమె ధైర్యంగా ముందుకు వచ్చి దీనిపై పోరాడిందని అప్పట్లో అన్నాడు విశాల్.

nanireddy

nanireddy

Next Story