విశాఖలో బాహుబలి తరహా ఘటన..రోడ్డు ప్రమాదంలో చిక్కుకున్న ఓ కన్నతల్లి ఆరాటం

విశాఖలో బాహుబలి తరహా ఘటన..రోడ్డు ప్రమాదంలో చిక్కుకున్న ఓ కన్నతల్లి ఆరాటం
x
Highlights

సృష్టిలో తల్లీ బిడ్డల బంధాన్ని మించినది లేదు.. అది అనంతం..పొత్తిళ్లలో బిడ్డ.. అందనంత ఎత్తుకు ఎదగాలని ఏతల్లయినా కలలు కంటుంది.. తన ఆశ, శ్వాస పిల్లల...

సృష్టిలో తల్లీ బిడ్డల బంధాన్ని మించినది లేదు.. అది అనంతం..పొత్తిళ్లలో బిడ్డ.. అందనంత ఎత్తుకు ఎదగాలని ఏతల్లయినా కలలు కంటుంది.. తన ఆశ, శ్వాస పిల్లల కోసమేనని ఆరాటపడుతుంది..అలాంటి బిడ్డకు ఏదైనా అపాయం కలిగితే? ఆ తల్లి తట్టుకోగలదా?

ఏ తల్లి కైనా.. తన పిల్లల ఎదుగుదలే ముఖ్యం.. నవమాసాలు మోసి కనిపెంచిన బిడ్డ మీద మమకారం ఉండటం సహజం.. కానీ ప్రాణం పోయే సమయంలోనూ పొత్తిళ్లలో పసిబిడ్డ క్షేమాన్నే కాంక్షించిందా తల్లి.. ప్రసవమే పునర్జన్మ లాంటిది.. నవమాసాలు మోసి కనిపెంచిన కొడుకు ఉన్నతిని.. అభ్యుదయాన్ని కాంక్షించిందా తల్లి.. తాను లేకపోయినా.. బిడ్డయినా నిండు నూరేళ్లూ బతకాలని తాపత్రయపడిందా తల్లి ప్రాణం.. అందుకే మృత్యువు ముంచుకొస్తున్నా.. మరణంలోనూ బిడ్డ భవిష్యత్తే ఆమెకు కళ్ల ముందు కదలాడింది..

ఈ సీన్ బాహుబలి సినిమా లోనిది..నీటిలో తన ప్రాణం పోతున్నా.. బిడ్డ ప్రాణం కాపాడాలని తపన పడుతుంది శివగామి.. ముఖంతో సహా నీటిలో మునిగిపోయినా.. బిడ్డను మాత్రం చేతితో ఎత్తి పట్టుకుని.. నీటి సుడులలో ప్రయాణిస్తుంది.. కొడుకు పట్ల కన్నతల్లికి ఉన్న ప్రేమ అలాంటిది.. బిడ్డలపై తల్లి మమకారానికి నిలువెత్తు నిదర్శనం ఈ ఘటన..అది సినిమా.. కానీ అలాంటి ఉదంతాన్ని తలపించే మరో సంఘటన విశాఖలో నిజంగా జరిగింది.. మృత్యువుటంచుల్లో ఉన్న ఓ కన్నతల్లి తన బిడ్డను బతికించాలని ఆరాటపడింది.. ఆమె ఏం చేసిందో మీరే చూడండి..

అది సంక్రాంతి సంబరం.. ఊరు ఊరంతా పండగ సంబరంలో మునిగి తేలుతోంది. విశాఖ జిల్లా సబ్బవరం మండలం, పైడివాడ గ్రామం కూడా సంక్రాంతి సంబరాల్లో మునిగి తేలుతోంది.. పండగకి అత్తారింటికి వెళ్లాలని నిర్నయించుకుంది.. బండ శ్రీను కుటుంబం.. బండశ్రీను, గౌరి దంపతులకు కుశాల వర్ధన్, హేమ రఘురాం అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు పిల్లలను వెంటబెట్టుకుని సంక్రాంతి పండగకి అత్తారింటికి వెళ్లాలని వీరు బయల్దేరారు. దారంతా.. పండగ సంబరాలు కనిపిస్తూనే ఉన్నాయి.. ఈ సంతోషం మధ్యే శ్రీను కుటుంబం అత్తారింటికి చేరుకుంది.. అక్కడ మూడు రోజులూ సంతోషంగా గడిపింది.

ఆ ఉత్సాహంలోనే కుటుంబం మొత్తం ద్విచక్రవాహనంపై పైడివాడ గ్రామానికి బయల్దేరింది. ప్రయాణం సజావుగా సాగుతోందనుకున్న సమయంలోనే అనుకోని ప్రమాదం ఎదురైంది.. శీను వాహనం సబ్బవరం శివారు చిన్నయ్యపాలెం టెర్రాకాన్ లే అవుట్ దగ్గరకు వచ్చేసరికి వారి బైకు కు వెనుకగా ఆర్టీసీ బస్సు వేగంగా దూసుకొచ్చింది.. ఎదురుగా వస్తున్న లారీని తప్పించే క్రమంలో బస్సు శ్రీను బైక్ ను ఢీకొంది. ఆ అదురుకు శ్రీను, బైక్ పై ముంుద కూర్చున్న కుశాల్ వర్ధన్ ఎగిరి రోడ్డు పక్కనే ఉన్న తుప్పల్లో పడిపోయారు. వాహనం వెనుక సీటుపై ఉన్న గౌరి మాత్రం రెండేళ్ల చిన్నారి హేమా రఘురాంతో కలసి రోడ్డుపై పడిపోయింది.. పైకి లేచే పరిస్థితి లేదు..ఓ పక్క పొత్తిళ్లలో కన్న బిడ్డ.. అసహాయస్థితిలో లేవలేని స్థితిలో గౌరి.. ఎదురుగా మీదకొచ్చేస్తున్న ఆర్టీసీ బస్సు..

అంత విషమ పరిస్థితుల్లోనూ గౌరి లో బిడ్డను రక్షించుకోవాలన్న తాపత్రయం పెరిగింది. బాహుబలి సినిమాలో శివగామి బిడ్డను నీటి ప్రవాహం నుంచి రక్షించినట్లు.. గౌరి కూడా తన బిడ్డను రెండు చేతులతో ఎత్తి పట్టుకుని పక్కనే ఉన్న తుప్పల్లోకి విసిరేసింది. అదే టైమ్ లో బస్సు వెనక చక్రాలు ఆమె తలపై నుంచి వెళ్లిపోయాయి. గౌరి అక్కడికక్కడే ప్రాణాలొదిలింది.. భర్త ఇద్దరు పిల్లలు మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

Show Full Article
Print Article
Next Story
More Stories