లండన్లో అనుష్క శర్మ ఫొటో రచ్చ రచ్చ

లండన్లో అనుష్క శర్మ ఫొటో రచ్చ రచ్చ
x
Highlights

భారత హైకమిషన్ కార్యాలయం యందు, మన టీమిండియా కలిసి దిగిన ఫోటోయందు, విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ ముందు, రహానే వెనుక ఎందుకు అని విమర్శలందు. శ్రీ.కో...

భారత హైకమిషన్ కార్యాలయం యందు,

మన టీమిండియా కలిసి దిగిన ఫోటోయందు,

విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ ముందు,

రహానే వెనుక ఎందుకు అని విమర్శలందు. శ్రీ.కో

లండన్‌లోని భారత హైకమిషన్ కార్యాలయం ఎదుట టీమిండియా దిగిన ఫోటోలో కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ ముందు వరసలో ఉండడం చాల విమర్శలకు దారితీసింది . టీమ్ వైస్‌-కెప్టెన్ అయిన రహానే వెనుక వరసలో ఉండడం, అతర్వత్ అనుష్క శర్మ ముందు వరసలో ఉండడం విమర్శలకు తావిచ్చింది. తాజాగా ఈ ఫోటోపై బీసీసీఐ వివరణ ఇచ్చినట్టు జాతీయ మీడియా వెల్లడించింది.
ఫోటోలు దిగే విషయంలో అక్కడ ఎలాంటి అభ్యంతరాలు లేవు. బంధువులతో కలిసి హాజరుకావచ్చని హై కమిషనర్‌, ఆయన భార్య ఆహ్వానించడం వల్లే అనుష్క అక్కడకు వచ్చింది. రహానేను వెనుక వరసలో నిలబడమని ఎవరూ చెప్పలేదు. ఇష్టపూర్వకంగానే అతను వెనక నిలబడ్డాడు. హై కమిషనర్ అధికారిక నివాసంలోకి ప్రవేశించే ముందు దిగిన ఫోటో అది` అని బీసీసీఐ అధికారి వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories