Top
logo

టీఆర్ఎస్‌ అభ్యర్ధి పిడమర్తి రవికి చేదు అనుభవం

టీఆర్ఎస్‌ అభ్యర్ధి పిడమర్తి రవికి చేదు అనుభవం
X
Highlights

ఖమ్మం జిల్లా సత్తుపల్లి టీఆర్ఎస్‌ అభ్యర్ధి పిడమర్తి రవికి చేదు అనుభవం ఎదురైంది. కల్లూరు మండలం బత్తులపల్లిలో...

ఖమ్మం జిల్లా సత్తుపల్లి టీఆర్ఎస్‌ అభ్యర్ధి పిడమర్తి రవికి చేదు అనుభవం ఎదురైంది. కల్లూరు మండలం బత్తులపల్లిలో ప్రచారం నిర్వహిస్తున్న పిడమర్తిని స్ధానికులు అడ్డుకున్నారు. నాలుగేళ్ళ నుంచి గ్రామంలో ఒక్క పని కూడా చేయకుండా ఓట్లు ఎలా అడుగుతారంటూ ప్రశ్నించారు. పిడిమర్తిపై పోటీ చేస్తున్న సండ్ర వెంకట వీరయ్య, ఎమ్మెల్సీ పొంగులేటిలకు అనుకూలంగా నినాదాలు చేశారు. గ్రామస్తుల ఆందోళనతో ప్రచార రథం దిగివచ్చిన పిడమర్తి గ్రామస్తులను బుజ్జగించే ప్రయత్నం చేశారు. నియోజకవర్గంలో చేపట్టిన పల్లె నిద్రను తమ గ్రామంలో ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. గ్రామస్తుల ఆందోళనలు కొనసాగుతుండగానే పిడమర్తి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Next Story