టీఆర్ఎస్ కు ఊహించని షాక్...సీఎం సభను...

x
Highlights

టీఆర్ఎస్ కు ఊహించని షాక్...సీఎం సభను...

ప్రజా ఆశీర్వాద సభలతో ఓటర్ల మనసు గెలుచుకోవాలని భావిస్తున్న టీఆర్ఎస్ ఊహించని షాకులు తగులుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో నిర్వహిస్తున్న బహిరంగ సభను కమ్మర్‌పల్లి మండలంలోని హసకొత్తూర్ ప్రజలు బహిష్కరించారు. ప్రజా ఆశీర్వాద సభకు వెళ్లకూడదంటూ గ్రామస్తులంతా ఏకగ్రీవ తీర్మానం చేశారు. దీంతో పాటు మిషన్ భగీరథ ఛైర్మన్‌ ప్రశాంత్ రెడ్డిని గ్రామంలో అడుగు పెట్టనివ్వమంటూ ప్రతిజ్ఞ చేశారు. హన్మంత్ రెడ్డి ఎత్తిపోతల పైప్‌ లైన్‌కు గెట్ వాల్ బిగించాలంటూ ఎన్నిసార్లు కోరినా ... పట్టించుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు గ్రామస్తులు ప్రకటించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories