Top
logo

ప్రేమపై బహిష్కరణ వేటు...

ప్రేమపై బహిష్కరణ వేటు...
X
Highlights

జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం భీమ్ రెడ్డి గూడెంలో ఆటవిక చర్య వెలుగులోకి వచ్చింది. మరో కులం వ్యక్తిని...

జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం భీమ్ రెడ్డి గూడెంలో ఆటవిక చర్య వెలుగులోకి వచ్చింది. మరో కులం వ్యక్తిని ప్రేమించిందన్న కారణంతో యువతిని గ్రామం నుంచి బహిష్కరించారు. వేరే కులం వ్యక్తిని ప్రేమించిన యువతిని ఆరు నెలల పాటు గ్రామ, కుల బహిష్కరణ విధిస్తూ గ్రామ పెద్దలు తీర్పు ఇచ్చారు. ఒకవేళ యువతిపై బహిష్కరణ ఎత్తివేసి గ్రామంలోకి అనుమతించాలంటే ఆమె గుండు కొట్టించుకోవాలనీ నాలుకపై వాతలు పెట్టించుకోవాలని షరతు పెట్టారు.

అంతేకాదు బహిష్కరణకు గురైన యువతి గ్రామంలోకి రావాలంటే పంది రక్తం ఒంటికి పూసుకుని ఊరేగించాలని కూడా పెద్దలు తీర్పు ఇచ్చారు. పైగా తీర్పు ఇచ్చిన పెద్దలకు 5 వేల రూపాయలతో మందు, విందు ఏర్పాటు చేయాలని కూడా అల్టిమేటం జారీ చేశారు. అయితే తీర్పు ను అమలు పరిచేందుకు నిన్న రాత్రి ఏర్పాట్లు జరిగాయి. ఈ వ్యవహారంపై కొందరు గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సరిగ్గా యువతికి గుండు కొట్టించే సమయంలో పోలీసులు ఎంటరయ్యారు. యువతిని హోంకు తరలించి కుల పెద్దలపై కేసు నమోదు చేశారు.

Next Story