విజయవాడలోని దుర్గగుడి కొత్త రూపురేఖలు

విజయవాడలోని దుర్గగుడి కొత్త రూపురేఖలు
x
Highlights

కృష్ణానదీ తీరాన ప్రకాశం బ్యారేజీని విద్యుత్తు దీపాలతో, భవానీ ద్వీపంలో రాత్రి వేళ లేజర్‌ షో అందమైన ఏర్పాట్లతో, రాజగోపురాన్ని ప్రత్యేక రంగుల్లో చూసిన...


కృష్ణానదీ తీరాన ప్రకాశం బ్యారేజీని విద్యుత్తు దీపాలతో,

భవానీ ద్వీపంలో రాత్రి వేళ లేజర్‌ షో అందమైన ఏర్పాట్లతో,

రాజగోపురాన్ని ప్రత్యేక రంగుల్లో చూసిన భక్తులు ఆనందంతో,

సౌండ్‌ అండ్‌ లైట్‌ షో, ప్రొజక్టరును లాంటి ఎన్నో ఏర్పాటులతో,

విజయవాడలోని దుర్గగుడి పరిసరాలను సిద్ధం చేశారు. శ్రీ.కో.

విజయవాడలోని దుర్గగుడి యొక్క రూపురేఖలు మార్చే విధంగా ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టింది. ఇప్పటికే కృష్ణానదీ తీరాన ఉన్న ప్రకాశం బ్యారేజీని అందమైన విద్యుత్తు దీపాలతో అలంకరించారు. భవానీ ద్వీపంలో రాత్రి వేళ లేజర్‌ షో ఏర్పాటు చేశారు. సాయంత్రం వేళ కృష్ణమ్మ పరవళ్లను వీక్షించే నగర వాసులకు దుర్గమ్మ కోవెల కూడా కనువిందు చేయనుంది. రూ.3 కోట్ల వ్యయంతో కోల్‌కతాకు చెందిన సంస్థ సౌండ్‌ అండ్‌ లైట్‌ షోను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే ఏర్పాటు చేసిన లైట్లతో ఆదివారం ట్రయల్‌ రన్‌ వేశారు. అవి భక్తులకు కనువిందు చేశాయి. రాజగోపురాన్ని ప్రత్యేక రంగుల్లో చూసిన భక్తులు ఆనంద పరవశులయ్యారు. స్వర్ణ ధగధగలతో మెరిసే దుర్గమ్మ ఆలయ గోపురం కూడా ఎరుపు, నీలం, పసుపు రంగుల్లో కనిపించింది. సౌండ్‌ అండ్‌ లైట్‌ షో ఏర్పాటులో భాగంగా ఇప్పటికే ప్రొజక్టరును సిద్ధం చేశారు. ఇంకా తెర ఏర్పాటు చేయాల్సి ఉంది. మూడు వారాల వ్యవధిలో భక్తులకు సౌండ్‌ అండ్‌ లైట్‌ షోను భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తామని అధికారులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories