తన పోటీపై స్పష్టత ఇచ్చిన విజయశాంతి

nanireddy
Updated on: 24 Dec 2018 4:00 PM IST
తన పోటీపై స్పష్టత ఇచ్చిన విజయశాంతి
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో తాను లేనని తెలంగాణ కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి స్పష్టం చేశారు.ఇవాళ (మంగళవారం) ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ తనకు సీటు కేటాయించడంలేదని వస్తున్న వార్తలో వాస్తవం లేదని.. తనకే పోటీ చేయడం ఇష్టం లేదన్నారు. ఇందుకు బలమైన కారణం తాను స్టార్‌ క్యాంపెయినర్‌గా బాధ్యతలు చూస్తుండటం వల్లేనని ఆమె అన్నారు. కాంగ్రెస్‌ గెలుపే లక్ష్యంగా ప్రచారం చేస్తానని విజయశాంతి చెప్పుకొచ్చారు. ఇదిలావుంటే విజయశాంతి మెదక్ లేదా దుబ్బాక నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారని అందరూ ఊహించారు. కానీ ఆమె అనూహ్యంగా పోటీభరి నుంచి తప్పుకున్నారు. 2009 లో మెదక్ నుంచి తెరాస తరుపున ఎంపీగా గెలిచిన విజయశాంతి ఆ తరువాత కాంగ్రెస్ లో చేరిపోయారు.

nanireddy

nanireddy

Next Story