చంద్రబాబుకు రెండు ప్రశ్నలను సంధించిన విజయసాయిరెడ్డి

చంద్రబాబుకు రెండు ప్రశ్నలను సంధించిన విజయసాయిరెడ్డి
x
Highlights

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. ప్రత్యేక హోదా వద్దు ప్యాకేజీయే ముద్దంటూ కేంద్రానికి కృతజ్ఞతలు చెబుతూ...

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. ప్రత్యేక హోదా వద్దు ప్యాకేజీయే ముద్దంటూ కేంద్రానికి కృతజ్ఞతలు చెబుతూ అసెంబ్లీలో చేసిన ధన్యవాద తీర్మానాన్ని ఉపసంహరించుకున్నారా? అంటూ ప్రశ్నించారు. అలాగే ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించాలంటూ కేంద్రానికి పంపిన అసెంబ్లీ తీర్మానాన్ని కూడా విత్‌ డ్రా చేసుకున్నారా? అంటూ చంద్రబాబును ప్రశ్నించారు. ఇవేమీ ఉపసంహరించుకోకుండా కేంద్రంపై పోరాటమంటూ డ్రామాలు ఆడుతున్నారా? అంటూ విరుచుకుపడ్డారు.
ఒకవేళ ప్యాకేజీకి కేంద్రం చట్టబద్ధత కల్పించి ఉంటే ప్రత్యేక హోదాకు పర్మినెంట్‌కు అన్ని దారులు మూసుకుపోయేవని అన్నారు. ఇక విభజన హామీల అమలుపై హైకోర్టులో చంద్రబాబు పిటిషన్‌ వేస్తాననడం కూడా పొలిటికల్‌ డ్రామానే అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories