ఉప ఎన్నికలు వచ్చే అవకాశం: విజయసాయి రెడ్డి

ఉప ఎన్నికలు వచ్చే అవకాశం: విజయసాయి రెడ్డి
x
Highlights

శ్రీకాకుళం జిల్లాలో ఈరోజు పర్యటించిన వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఎంపీలు రాజీనామా...

శ్రీకాకుళం జిల్లాలో ఈరోజు పర్యటించిన వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఎంపీలు రాజీనామా చేసిన స్థానాల్లో ఉపఎన్నికలు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. టీడీపీ నిర్లక్ష్యం కారణంగానే ఉత్తరాంధ్ర వెనుకబడిందని, సంక్షేమ పథకాల అమలులో పాదర్శకత లేదని, ప్రాజెక్టులు పూర్తి కావడం లేదని విమర్శించారు. నాలుగేళ్లయినా వంశధార ఫేజ్‌ 2 పనులను ఎందుకు పూర్తి చేయలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. టీడీపీ నేతలు అవినీతికి ప్రాధాన్యత ఇవ్వడం వల్లనే ప్రాజెక్టులు పూర్తి కావడం లేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేశ్‌ అవినీతి ధనార్జనతో 3 లక్షల కోట్లు దోచుకుని, విదేశాల్లో దాచుకున్నా.. సంతృప్తి చెందడం లేదని.. అందుకే రాష్ట్రాన్ని కొల్లగొడుతున్నారని ఆరోపించారు. ముందస్తు ఎన్నికలు ఎప్పుడొచ్చిన వైఎస్సార్‌ సీపీ సిద్ధంగా ఉందని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories