గుజరాత్ సీఎంగా విజయ్ రూపాని

lakshman
Updated on: 24 Dec 2018 12:26 PM IST
గుజరాత్ సీఎంగా విజయ్ రూపాని
X

గుజరాత్‌ ముఖ్యమంత్రిగా విజయ్‌ రూపాని మరోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. గాంధీనగర్ లో జరిగిన భాజపా శాసనసభాపక్ష సమావేశంలో విజయ్‌ రూపానీని ఏకగ్రీవంగా ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. ఉప ముఖ్యమంత్రిగా నితిన్‌ పటేల్‌కు మరో అవకాశం కల్పించారు. ఇటీవల జరిగిన గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా 99 స్థానాల్లో విజయం సాధించింది. మూడంకెల సీట్లు సాధించలేకపోయామని మధన పడుతోన్న బీజేపీకి.. ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యే రతన్‌సిన్హ్‌ రాథోడ్‌ మద్దతు పలకడంతో ఆ సంఖ్య వందకు చేరింది. బీజేఎల్పీ నేతగా విజయ్‌ రూపానీని ఎన్నుకున్నట్లు గుజరాత్‌ వ్యవహారాల పరిశీలకుడు కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రకటించారు.


lakshman

lakshman

Next Story