అప్పు తీర్చడానికి నేను రెడీ...మోడీకి రాసిన లేఖను బయటపెట్టిన మాల్యా

x
Highlights

బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా ఎట్టకేలకు స్పందించాడు. సెటిల్మెంట్‌కు అన్ని ప్రయత్నాలు చేస్తున్నానని చెప్పాడు. భారత...

బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా ఎట్టకేలకు స్పందించాడు. సెటిల్మెంట్‌కు అన్ని ప్రయత్నాలు చేస్తున్నానని చెప్పాడు. భారత ప్రభుత్వం తనపై కనికరం లేకుండా వ్యవహరిస్తోందని ఆరోపించాడు. ఇదే విషయమై మాల్యా రెండేళ్ల క్రితం ప్రధాని మోడీకి లేఖ రాశాడు. ఆ లేఖను ట్విట్టర్ ద్వారా ప్రస్తుతం బయటపెట్టాడు.

బ్యాంకులకు వేల కోట్లు టోపీ పెట్టి లండన్‌లో తలదాచుకుంటున్న విజయ్ మాల్యా ట్విట్టర్‌లో ప్రధాని నరేంద్ర మోడీకి రాసిన లేఖను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. తాను రెండేళ్ల క్రితమే 15 ఏప్రిల్ 2016లో ప్రధానితో పాటు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి లేఖ రాసినట్లు పేర్కొన్నాడు. స్వదేశానికి వచ్చి 13వేల కోట్ల అప్పులు చెల్లిస్తానన్న మాల్యా బ్యాంకుల నుంచి తాను తీసుకున్న అప్పును చెల్లించేందుకు తాను సంసిద్ధత వ్యక్తం చేస్తూ లేఖ రాసినట్లు తెలిపాడు. బ్యాంకులకు ఎగవేత విషయంలో తనను మీడియా అనవసరంగా టార్గెట్ చేసిందని ఆవేదన వ్యక్తం చేశాడు. బ్యాంకు డిపాజిటర్ల పేరుతో తనను పోస్టర్ బాయ్‌ను చేశారని పేర్కొన్నాడు. తనపై ఎగవేతదారు ముద్రవేశారని వాపోయాడు.

తాను 2016 ఏప్రిల్ 15న ప్రధాని నరేంద్ర మోడీకి, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి లేఖ రాశానని ఆ లేఖను తాను ఇప్పుడు ప్రజల ముందుకు తీసుకు వస్తున్నానని మాల్యా తెలిపాడు. తాను బ్యాంకుల లోన్ విషయంలో సెటిల్ చేయడానికి సిద్ధమైనప్పటికీ వారి నుంచి ఎలాంటి స్పందన లేదని, వారు చాలాకాలంగా మౌనం వహించారని విజయ్ మాల్యా ఆరోపించాడు. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ కోసం బ్యాంకులు ఇచ్చిన రూ.9000 కోట్ల లోన్లను నేను ఎత్తుకెళ్లానని రాజకీయ నాయకులు, మీడియా ఆరోపణలు చేసింది. కొన్ని బ్యాంకులు అయితే తనపై డిఫాల్టర్‌ను ముద్ర కూడా వేశాయని మాల్యా తెలిపాడు. ఈ అంశాన్ని సెటిల్ చేసుకోవడానికి తాను ప్రతి ప్రయత్నం చేస్తూనే ఉన్నానని మాల్యా స్పష్టం చేశాడు.

ఈ అంశం రాజకీయ అంశమై కూర్చున్నదని, ఇది రాజకీయం కావడం కారణంగా నేను ఏం చేయలేకపోయానని వెల్లడించారు. రాజకీయం జోక్యం చేసుకోవడంతో నేను ఏం చేయలేకపోయానని అభిప్రాయపడ్డారు. నేను అప్పు తీర్చాలని ప్రభుత్వం కోరుకుంటుందా లేదా? ప్రభుత్వ బ్యాంకులు సహా, నేను అప్పు తీసుకున్న బ్యాంకులకు రుణాలు చెల్లించడం కోసం నా ఆస్తులు అమ్మివేసేందుకు తమ గ్రూప్ దరఖాస్తులు చేసుకుందని, కానీ ఈడీ మాత్రం వాటిని అమ్మేందుకు అభ్యంతరం వ్యక్తం చేసిందని ఇది ఆశ్చర్యకరమైన విషయమని మాల్యా తెలిపాడు. అసలు నేను పబ్లిక్ సెక్టార్ బ్యాంకులకు ఇవ్వాల్సిన డబ్బులు తిరిగి ఇవ్వాలని ప్రభుత్వం కోరుకుంటుందా, లేదా అనేది నా మౌలిక ప్రశ్న' అని మాల్యా ప్రశ్నించాడు. రూ.13,900 కోట్ల ఆస్తులు విచారణ సంస్థల చేతుల్లో 'నాకు చెందిన పలు అసెట్స్‌ను ఈడి స్వాధీనం చేసుకుంది. నా చేతుల్లో లేదా నా కుటుంబం చేతుల్లో ఉన్న కంపెనీల ఆస్తులను ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఈడీ జఫ్తు చేసుకుంది. వీటి విలువ రూ.13,900 కోట్లని విజయ్ మాల్యా వెల్లడించారు. మాల్యా వెల్లడించిన విషయాలు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాయి. కాంగ్రెస్ కూడా ఈ విషయంలో అప్పుడే విమర్శలు ప్రారంభించింది. రానున్న రోజుల్లో ఈ అంశం ఎన్ని మలుపులు తీసుకుంటుందో వేచిచూడాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories