ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ సెల్‌ టవర్‌ ఎక్కిన విజయ్‌ భాస్కర్‌

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ సెల్‌ టవర్‌ ఎక్కిన విజయ్‌ భాస్కర్‌
x
Highlights

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ రోజురోజుకు ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. తాజాగా అనంతపురం జిల్లా ధర్మవరంలో ప్రత్యేక హోదా కోసం ఓ యువకుడు ప్రాణత్యాగానికి...

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ రోజురోజుకు ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. తాజాగా అనంతపురం జిల్లా ధర్మవరంలో ప్రత్యేక హోదా కోసం ఓ యువకుడు ప్రాణత్యాగానికి సిద్ధమయ్యాడు. పట్టణానికి చెందిన పెనుబోలు విజయ్‌భాస్కర్ అనే యువకుడు రూరల్ పోలీస్ స్టేషన్‌ సమీపంలోని టవర్ ఎక్కాడు. ప్రత్యేక హోదా కోసం తాను ఆత్మహత్యకు సిద్ధమైనట్టు రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టవర్‌పైనున్న భాస్కర్‌ను కిందకు దింపేందుకు పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు. రాష్ట్ర విభజన సమయంలో సమైక్యాంధ్ర కోసం పోరాడినా ఫలితం దక్కలేదని ఇప్పుడు ప్రత్యేక హోదా కూడా రాకపోతే ఎలాగంటూ విజయ్‌ భాస్కర్ తన లేఖలో ప్రశ్నించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories